హంగేరియన్
బైక్ బ్రాండ్ కీవే (Keeway) ఇండియాలో తమ తొలి
బైక్ కె-లైట్ (K-Lite) ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే, ఈ కంపెనీ తమ కీవే కె-లైట్ (Keeway K-Lite) క్రూయిజర్
బైక్ ను మే 17, 2022వ తేదీన
ఇండియన్ మార్కెట్లో విడుదల చేయనుంది. కీవే బ్రాండ్ హంగేరికి చెందినది అయినప్పటికీ, ప్రస్తుతం ఈ బ్రాండ్ చైనీస్ ఆటో కంపెనీ కియాన్‌జియాంగ్ గ్రూప్ (Qianjiang Group)లో భాగంగా ఉంది. ఇదే గ్రూప్ ప్రస్తుతం ఇటలీకి చెందిన బెనెల్లీ (Benelli) మోటార్‌సైకిల్స్ బ్రాండ్ ను కూడా కలిగి ఉంది.ఇండియాలో అమ్మబడుతున్న బెనెల్లీ మోటార్‌సైకిళ్లన్నీ కూడా ప్రస్తుతం కియాన్‌జియాంగ్ గ్రూపుకు చెందినవే. కియాన్‌జియాంగ్ అనేక కొత్త ఇంజన్‌లు ఇంకా అలాగే మోటార్‌సైకిళ్ల కోసం పేటెంట్ లను కూడా దాఖలు చేసింది, ఇవి కెటిఎమ్ బైక్‌ల నుండి బాగా ప్రేరణ పొందినవిగా ఉంటాయి. కీవే బ్రాండ్ చిన్న ఇంజన్ తో కూడిన క్రూయిజర్ బైక్‌లు, స్కూటర్లు, నేక్డ్ స్ట్రీట్ బైక్‌లు ఇంకా అలాగే 125 సిసి వరకు ఇంజన్ సామర్థ్యాలతో కూడిన అడ్వెంచర్ బైక్‌లను కూడా తయారు చేస్తుంది.
ఇక ఈ హంగేరియన్ బ్రాండ్ క్రూయిజర్ బైక్‌లు ఇంజన్ సామర్థ్యం పరంగా చాలా చిన్నవే అయినా కానీ వాటి డిజైన్ మాత్రం అమెరికన్ ఐకానిక్ టూవీలర్ బ్రాండ్ హార్లే డేవిడ్‌సన్ బైక్‌ల నుండి ప్రేరణ పొందినవిగా అవి ఉంటాయి.
ఇండియన్ మార్కెట్లో విడుదల కాబోయే కీవే కె-లైట్ క్రూయిజర్
బైక్ ఫోటోలు ఇప్పటికే వెల్లడయ్యాయి. ఈ బైక్‌లో డ్యూయల్ సైలెన్సర్ సెటప్ కనిపిస్తుంది. ఇంకా అలాగే ఇది 125 సీసీ కంటే కూడా ఎక్కువ ఇంజన్ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుందని తెలుస్తోంది.ఇక కీవే ఈ క్రూయిజర్ బైక్ లో 125 సీసీకి బదులుగా బెనెల్లీ 502సి మోడల్ నుండి గ్రహించిన పెద్ద 500 సిసి, ట్విన్-సిలిండర్ ఇంకా లిక్విడ్-కూల్డ్ ఇంజన్ ను కలిగి ఉంటుదంని సమాచారం. బెనెల్లీ మోడల్‌లోని ఈ ఇంజన్ మాక్సిమం 47 బిహెచ్‌పి పవర్ ను ఇంకా 46 ఎన్ఎమ్ పీక్ టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే, కీవే నుండి రాబోయే క్రూయిజర్‌లో, ఇదే బెనెల్లీ ఇంజన్ కాస్తం భిన్నమైన పవర్ ఇంకా అలాగే టార్క్ గణాంకాలను కలిగి ఉండొచ్చని సమాచారం తెలుస్తోంది. ఈ
బైక్ లో ఉపయోగించబోయే ఇంజన్ విషయంపై ఇంకా ఎలాంటి స్పష్టత అనేది లేదు.