ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా నాటు నాటు పాటకి డ్యాన్స్ చేస్తుంది. ఎందుకో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ఈ పాటకు వస్తోన్న రెస్పాన్స్ గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే.బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఏకంగా ఇంటర్నేషనల్ టాప్ అవార్డు అయిన ఆస్కార్ అవార్డ్ ని కైవసం చేసుకుంది ఈ సాంగ్. కేవలం ఆస్కార్ అవార్డ్ మాత్రమే కాదు.. అంతర్జాతీయ వేదికపై చాలా అవార్డ్స్ ఈ పాటకు సలాం కొట్టాయి. దీంతో మరోసారి ఈ పాటకు డ్యాన్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఈ పాటకి సంబంధించిన వీడియోస్ ఇప్పుడు నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఇండియన్ మైఖేల్ జాక్సన్ ఇండియన్ టాప్ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ అయిన ప్రభుదేవా ఆర్.ఆర్.ఆర్ చిత్రయూనిట్ కు తనదైన స్టైల్ లో శుభాకాంక్షలు తెలిపారు. తన టీంతో కలిసి నాటు నాటు పాటకు స్టెప్పులేసి సూపర్ గా అదరగొట్టారు. 


ఈ వీడియోను నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ రెడ్ హార్ట్ సింబల్స్ తో విషెస్ చేశారు.దేశవ్యాప్తంగా కూడా ప్రభుదేవా డాన్స్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి పాటలో కూడా సరికొత్త స్టెప్పులతో ఆ సాంగ్ విజువల్ చేంజ్ చేస్తుంటారు. ఆయన డాన్స్ కు చాలా మంది అభిమానులు ఉన్నాయి. అయితే గత కొంత కాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న ప్రభుదేవా రీసెంట్ గా చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో తార్ మార్ పాటకి కొరియోగ్రఫీ చేసి ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు నాటు నాటు పాటకు స్టెప్పులేయడంతో ఆయన ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. మీరు సూపర్ మాస్టర్ అంటూ ట్రిపుల్ ఆర్ చిత్రటీంకు ఇది బెస్ట్ ట్రిబ్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ప్రభు దేవా చేసిన ట్వీట్ రామ్ చరణ్ రీ ట్వీట్ చేసి ప్రభుదేవాకి ధన్యవాదాలు తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: