ఎక్కడ చూసినా ఈ కరోనా పేరు వినగానే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గత రెండు సంవత్సరాలుగా ప్రపంచ దేశాలన్నింటినీ అతలాకుతలం చేస్తోంది. ఈ కరోనా వైరస్ కారణంగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, పాటు ఇంకా ఎన్నో నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఇప్పటికే కరోనా రెండు వేవ్ లను సమర్థవంతంగా ప్రపంచ దేశ ప్రజలు ఎదుర్కోవడం జరిగింది. ఇక త్వరలోనే కరోనా వైరస్ మరొక విధంగా రూపాంతరం చెంది ప్రజలపై దాడి చేయడానికి సిద్ధంగా ఉంది. ప్రజలు తమ శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
దీనిని ఎదుర్కొనేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఉచితంగానే రెండు టీకాలను అందించడం జరిగింది. అందులో కొవి- షీల్డ్ అలాగే కో వ్యాక్సిన్. ఈ రెండింటి టీకాలు వేయించుకోవడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, తద్వారా కరోనా వైరస్ ను అంతం చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా భారత దేశంలో స్వచ్ఛందంగా ఎంతో మంది ప్రజలు వ్యాక్సిన్ వేయించుకోవడం జరిగింది. ఇక భారతదేశంలో జరిగిన నాలుగవ జాతీయ సెరో సర్వే ప్రకారం, భారతీయులలో 67% మందిలో వైరస్ కు వ్యతిరేకంగా ప్రతిరోధకాలను ఉత్పత్తి చేసినట్లు తెలిపింది.
పిల్లలతో సహా అందరిపై సర్వే చేయగా ,మూడింట రెండు వంతుల మందికి కారణమైన వైరస్ కు, వ్యతిరేకంగా ప్రతిరోధకాలను తమ శరీరంలో అభివృద్ధి చేసినట్లు తేలింది. ఇంకా 40 కోట్ల మంది ప్రజలు వైరస్ హాని కలిగి ఉన్నారని.. కేంద్ర మంత్రిత్వ ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక మొత్తం మీద 67.6 శాతం మంది ఇండియన్స్ లో శరీరంలో యాంటీ బాడీస్ ఉత్పత్తి అయినట్లు సమాచారం. ఇందులో ముఖ్యంగా 6 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల మధ్య వయసు కలిగిన పిల్లలు, 50 శాతానికి పైగా కొవిడ్-19 బారినపడి, ఆ తర్వాత దీనికి వ్యతిరేకంగా వారిలో ప్రతిరోధకాలు అభివృద్ధి చేసుకున్నట్లు సర్వే వెల్లడించింది.

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి