బలం ఉన్నోడిదే ఆధిపత్యం కొనసాగుతూనే ఉంటుంది.. కేవలం మనుషుల్లో మాత్రమే కాదు అడవులలో ఉండే జీవరాసులలో కూడా ఇదే కొనసాగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అడవుల్లో ఎన్నో రకాల క్రూరమృగాలు ఉంటాయి. పులులు చిరుతపులులు హైనాలు నక్కలు ఇలా ఇతర జంతువులను వేటాడి ఆహారాన్ని సంపాదించుకునే జంతువులు ఎన్నో ఉన్నాయి. కానీ వీటన్నింటి పై ఆధిపత్యం చెలాయించేది మాత్రం సింహాలు అనే చెప్పాలి. సింహం అతి బలవంతమైనది కాబట్టే అడవికి రారాజు అని చెబుతూ ఉంటారు. ఇక ఇతర జంతువులు ఆ వేటాడిన ఆహారాన్ని కూడా సింహాలు ఎంతో అలవోకగా సొంతం చేసుకుంటూ ఉంటాయి.


 ఇలా అడవుల్లో ఉండే క్రూరమైన జంతువుల మధ్య ఎప్పుడైనా పోరు జరిగింది అంటే చాలు అది ఎంతో హోరాహోరీగా భయంకరంగా ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇలాంటి తరహా వీడియోలు ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి. ఈ క్రమంలోనే అడవుల్లో ఉండే క్రూర మృగాల మధ్య పోరు జరిగిన  వీడియోలను ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది. ఇటీవలే వీడియో వైరల్ గా మారిపోయింది ఈ వీడియోలో చూసుకుంటే అడవికి రారాజు అయిన సింహం ఏకంగా చిరుతపులి పై దాడి చేసింది.


 చిరుతపులి ఎంతో కష్టపడి అడవి పందిని వేటాడింది. చివరికి అడవి పంది ని పట్టుకుని గొంతును నోటితో గట్టిగా అదిమి పెట్టింది. కాసేపటి  వరకు ప్రాణాలు రక్షించుకునేందుకు ప్రయత్నించిన అడవి పంది చివరికి చిరుతపులికీ లొంగిపోయింది. అంతలోనే అక్కడికి ఒక భారీ సింహం వచ్చింది. చిరుతపులి పై ఒక పంజా విసిరింది. అయితే కాసేపు చిరుత పులి సింహంతో పోరాడింది. కానీ సింహం బలం ముందు చివరికి తలవంచి ఆహారాన్ని  అక్కడే వదిలేసి పారిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిన పోగా బలం ఉన్నవాడిదే రాజ్యం అంటూ ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ చేస్తూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: