ప్రయాణాలు చేసే సమయం లో కొన్ని సార్లు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతుంటాయి. అప్పటికే అలసి పోయిన వారు తమకు బస్సుల్లో, లేదా ట్రైన్లలో ఏదైనా సీటు దొరుకుతుందేమోనని చూస్తుంటారు. నిలబడ లేక ఇబ్బంది పడతారు. అయితే అదే సమయం లో తోటి ప్రయాణికుల తో సీటు విషయం లో ఘర్షణ ఏర్పడుతుంది. అవి పెద్దవి అయితే తిట్టు కోవడమే కాకుండా కొట్టుకుంటుంటారు. ఇలాంటి ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇద్దరు మహిళలు మెట్రో ట్రైన్ లో సీటు కోసం గొడవ పడ్డారు. ఈ క్రమం లో ఆసక్తికర పరిణామం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

ఢిల్లీ బీజేపీ నేత తజిందర్ పాల్ సింగ్ బగ్గా తాజాగా ట్విట్టర్‌ లో ఆసక్తికర వీడియో షేర్ చేశారు. వీడియోలో, ఇద్దరు మహిళలు ఢిల్లీ మెట్రోలో సీట్ల ఏర్పాట్ల విషయం లో గొడవ పడుతున్నారు. ఇద్దరు మహిళలు మధ్య వాగ్యుద్ధం ఏర్పడింది. క్రమం గా వారి గొడవ పెద్దదైంది. ఇంతలో ఓ మహిళ తన బ్యాగులో చేయి పెట్టింది. అందులో నుంచి ఏం తీస్తుందోననే ఆసక్తి ఏర్పడింది. అకస్మాత్తుగా తన బ్యాగులో నుంచి ఆమె పెప్పర్ స్ప్రే తీసింది. వెంటనే తనతో గొడవ పడుతున్న మహిళ ముఖం మీద స్ప్రే చేసింది. ఈ హఠాత్పరిణామంతో బాధిత మహిళ బాధతో గోల పెట్టింది. ఢిల్లీ మెట్రోలో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇటీవల ఇద్దరు ప్రేమికులు చుట్టూ ప్రయాణికులున్నప్పటికీ ముద్దుల్లో మునిగి పోయారు. మరో ఘటన లో ఓ అమ్మాయి తన శరీరంపై కేవలం బ్రా, మినీ స్కర్ట్ ధరించి ప్రయాణించింది. ఇటువంటి ఘటనలు నివారించాలని ఢిల్లీ మెట్రోకు నెటిజన్లు సూచించారు. ప్రస్తుత పెప్పర్ స్ప్రే కొట్టిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పెప్పర్ స్ప్రే కొట్టిన మహిళ తీరును నెటిజన్లు విమర్శిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: