
ఏకంగా ఫోర్ వీలర్ కు సంబంధించిన వీడియో అందరూ దృష్టిని ఆకర్షిస్తూ ఆశ్చర్యపోయేలా చేస్తూ ఉంది. అయితే ఫోర్ వీలర్ అనగానే కారు లేకపోతే ఆటోనో అనుకోకండి. ఇది ఒక బైక్. అదేంటి ఫోర్ వీలర్ అంటున్నారు. బైక్ అంటున్నారు. వినడానికి విచిత్రంగా ఉంది కదా. వినడానికి మాత్రమే కాదు ఇక వైరల్ గా మారిపోయిన వీడియో చూస్తే మరింత విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. ఒక వ్యక్తి తన క్రియేటివిటీకి సానపెట్టి వినూత్నమైన రీతిలో ఎవరి ఊహకందని విధంగా ఒక బైక్ ని ఫోర్ వీలర్ గా మార్చాడు. అంతేకాదు ఆ బైక్ ని రోడ్డు మీద నడుపుతూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
అయితే ఇక ఇలా బైక్ తయారు చేసే సమయంలో ఒక టైర్ కింద మరో టైర్ పెట్టి ట్రై చేశాడు. ఇలా ఏకంగా ఒకదానిమీద మరొక టైర్ పెట్టి దానిపై ఎక్కి అతను బైక్ నడుపుతూ ఉండడం గమనార్హం. ఇది చూసిన నేటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. అయితే బైక్ అయితే నడుపుతున్నావు కానీ ఎలా కిందికి దిగుతావు స్వామి అని నేటిజన్స్ కామెంట్లు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో పై ఒక లుక్ వెయ్యండి.