బస్సు, రైలు ప్రయాణాలు అన్నాక ఖచ్చితంగా ప్రయాణికులకు ఏదొక సందర్భంలో ఇబ్బంది కలుగుతుంది. కానీ అదే రూ.5 లక్షలు పెట్టి టికెట్ కొనుగోలు చేసి  బిజినెస్ క్లాస్‌ విమానంలో ప్రయాణికుడికి చుక్కలు తప్పలేదంటే.. అతడు ఎంత వేదనకు గురై ఉంటాడు. ఎయిర్ ఇండియా బిజినెస్ క్లాస్ విమానంలో తన ప్రయాణంలో కలిగిన చేదు అనుభవాన్ని బాధితుడు  అయిన వినీత్ కే. తన ఎక్స్ ఖాతా వేదికగా పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతుంది.తాజాగా దేశ రాజధాని అయిన న్యూఢిల్లీ నుంచి న్యూయార్క్ ఎయిర్ ఇండియా విమానం బయలుదేరింది. అది కూడా ముందుగా ప్రకటించిన షెడ్యూల్ కంటే.. 25 నిమిషాల ఆలస్యంగా ఆ విమానం టేక్ ఆఫ్ అయింది. ఇక ఆ విమానంలో సీట్ శుభ్రంగా లేదు.. బాగా మాసి పోయి ఉంది. ఇంకా అలాగే సీట్లకు ఉండే కవర్లు కూడా చాలా అపరిశుభ్రంగా ఉన్నాయి. నిద్రకు ఉపక్రమించే క్రమంలో సీటు వెనక్కి నెట్టితే అది వెళ్ల లేదు. ఇక విమాన సిబ్బంది తనకు సరఫరా చేసిన ఆహారం కూడా చెత్తగా ఉంది. మరోవైపు విమానంలో టీవీ కూడా పని చేయకపోవడం మరో విశేషం. తన లగేజీకి ఉన్న ట్యాగ్ కూడా ఊడిపోయింది. ఇంకా అంతేకాదు తన సూట్ కేసు హ్యాండిల్ కూడా పగిలిపోయింది, ఆ లగేజీ జిప్ ఆచూకీ లేకుండా పోయింది. 


దీంతో సదరు విమాన ప్రయాణంలో తనకు కలిగిన కష్టాలకు సంబంధించిన ఫొటోలను ఆ ప్రయాణికుడు ఎక్స్ వేదికగా  పంచుకున్నాడు.అయితే అతను తరచు న్యూయార్క్, లండన్, షికాగో ప్రయాణిస్తూ ఉంటానన్నారు. ఆ క్రమంలో ఎమిరెట్ సంస్థకు చెందిన విమానాల్లో ఎక్కువగా ప్రయాణం సాగిస్తూ ఉంటానని అతను గుర్తు చేసుకున్నారు. అయితే తాజాగా ఎయిర్ ఇండియా బిజినెస్ క్లాస్‌ విమానంలో ప్రయాణం చేయాలనుకున్నానని అతను తెలిపారు.పైగా అదీ కూడా న్యూఢిల్లీ నుంచి న్యూయార్క్‌కు నేరుగా ఈ సర్వీస్ ఉండడంతో.. ఈ ఎయిర్ ఇండియా సర్వీస్‌ను ఎంచుకున్నట్లు అతను చెప్పారు. అయితే ఈ విమాన ప్రయాణం తనకో పీడకల అని వివేక్ కే. అభివర్ణించారు. ఇక వివేక్ కే. ఎక్స్ వేదికగా స్పందించిన ఘటనపై ఎయిర్ ఇండియా కంపెనీ ఎక్స్ వేదికగా స్పందించింది. ఆ కొద్ది సేపటికే దానిని ఆ కంపెనీ తన ఖాతా నుంచి తొలగించింది. మరోవైపు వివేక్ ని తన విమాన ప్రయాణంలో కలిగిన కష్టాలపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తూ స్పందిస్తున్నారు. న్యూఢిల్లీ నుంచి సింగపూర్ వెళ్లే క్రమంలో ఎయిర్ ఇండియా విమానంలో ఇలాంటి అనుభవం గతంలో తనకు ఎదురైందని ఓ యూజర్ కామెంట్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: