ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఓ యువతి చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. అంతరిక్ష యానానికి తొలిసారిగా తెలుగు యువతి సన్నద్ధమవుతోంది. ఈ నెల 11వ తేదీన ప్రముఖ అంతరిక్ష వాహక నౌక యూనిటీ 22ను ఉపయోగించనున్నట్లు అమెరికాకు చెందిన ప్రముఖ ప్రైవేటు సంస్థ వర్జిన్ గెలాక్టిక్ ప్రకటించింది. ఆ సంస్థ అధిపతి సర్ రిచర్డ్ తో పాటు ఉపాధ్యక్షురాలు హోదాలో అంతరిక్ష ప్రయాణం చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు శిరీష బండ్ల.

ఈ ఘనతను అందుకున్న తొలి తెలుగు మూలాలు ఉన్న మహిళ గా శిరీష చరిత్ర సృష్టించారు. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో ఆమె తల్లిదండ్రులు నివాసం ఉండగా చాలా ఏళ్ల క్రితమే ఆమె కుటుంబం అమెరికాలో స్థిరపడ్డారు. డాక్టర్ అనురాధ, డాక్టర్ మురళీధర్ రావు లు అక్కడే తమ కూతురును ఏరోస్పేస్ అండ్ షో నాటికల్ ఇంజనీరింగ్ చదివించి పట్టభద్రులు చేశారు. జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసిన అనంతరం 2015 నుంచి వర్జినల్ గెలాక్టిక్ లో పలు కీలక బాధ్యతలను శిరీష నిర్వహిస్తున్నారు.

ఇక బండ్ల శిరీష అంతరిక్షంలోకి వెళ్తున్న వార్త వెలువడగానే ప్రముఖ సెలబ్రిటీలు అందరూ ఆమె పై ప్రశంసలతో పొగిడారు. ఈ అంతరిక్షయానం కోసం వర్జిన్ గెలాక్టిక్ యూనిటీ పేరుతో ప్రత్యేక వ్యోమ నౌక సిద్ధం చేసింది. ముఖ్యంగా అంతరిక్ష వాణిజ్య యాత్రల కోసం దీన్ని అభివృద్ధి చేసింది. ఈ రాకెట్ లో అంతరిక్షం వెళ్లేందుకు ఇప్పటికే దాదాపు 600 మంది పేర్లను నమోదు చేసుకున్నారు. అంతరిక్ష ప్రయాణం కోసం గత వారంలో వర్జిన్ కు అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అనుమతులు జారీ చేసింది. దీంతో ఈనెల 11న ప్రయోగం చేపట్టేందుకు వర్జిన్ గెలాక్టిక్ సిద్ధమవుతోంది. అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ కూడా ఈనెల 20 న అంతరిక్ష యానం చేస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: