పునీత్ రాజ్ కుమార్ తెలుగు లో మొట్ట మొదటి సారి 2008 లో జాకీ అనే సినిమా ను తెలుగు లో విడుదల చేశారు. ఈ సినిమా కన్నడ లో కూడా జాకీ అనే పేరు తోనే విడుదల అయింది. దీని తర్వాత 2010 లో పండు గాడు అనే కన్నడ సినిమానే బిందాస్ అని తెలుగు లో విడుదల చేశారు. అలాగే చాలా రోజుల గ్యాప్ తర్వాత 2017 లో కన్నడ లో వచ్చిన రాజకుమార అనే సినిమా ను తెలుగు లో కూడా రాజ కుమార అని విడుదల చేశారు. నిజానికి ఈ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గర అయ్యారు. దీంతో మళ్లీ ఇదే సంవత్సరంలో అంజనీ పుత్ర అనే సినిమా తో తెలుగు అభిమానుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కన్నడ లో కూడా అంజనీ పుత్ర గానే విడుదల అయింది. దీని తర్వాత 2019 లో నటసార్వభౌమ అనే సినిమా ను కూడా తెలుగు విడుదల చేశారు. అలాగే ఈ మధ్య కాలంలో యువరత్న అనే కన్నడ సినిమా ను కూడా తెలుగు లో యువరత్న గానే విడుదల చేశారు. ఇలా తన కన్నడ సినిమా లను తెలుగు లో విడుదల చేసి చాలా మంది తెలుగు అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు. పునీత్ రాజ్ కుమార్ మరణ వార్త అటు కన్నడ ప్రజల తో పాటు తెలుగు ప్రజలను కూడా చాలా ఇబ్బందికి గురి చేస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి