జపనీస్ కార్ కంపెనీ టొయోటా (Toyota) భారత మార్కెట్లో అమ్ముతున్న ఫ్లాగ్‌షిప్ ప్రీమియం ఎస్‌యూవీ ఫార్చ్యూనర్ (Fortuner) లో కంపెనీ మరో కొత్త వేరియంట్ ను మార్కెట్లో రిలీజ్ చేసింది. ఈ మోడల్ లైనప్ లో టాప్-ఆఫ్ ది లైన్ వేరియంట్ గా కంపెనీ తమ కొత్త టొయోటా ఫార్చ్యూనర్ జిఆర్-ఎస్ (Toyota Fortuner GR-S) వేరియంట్ ను రిలీజ్ చేసింది. ఇండియన్ మార్కెట్లో ఫార్చ్యూనర్ ఈ కొత్త వేరియంట్ ధర  వచ్చేసి రూ. 48.43 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఇక దీని ధర ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న టొయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ వేరియంట్ 4WD వేరియంట్ కంటే దాదాపు రూ.3.8 లక్షలు ఎక్కువనే చెప్పాలి.ఇక టొయోటా ఫార్చ్యూనర్ జిఆర్-ఎస్ (Toyota Fortuner GR-S) వేరియంట్ ఇతర ఫార్చ్యూనర్ వేరియంట్‌ల కంటే ఎక్కువ మెకానికల్ ఇంకా అలాగే కాస్మెటిక్ అప్‌గ్రేడ్‌ లను కలిగి ఉంటుంది. టొయోటా ఫార్చ్యూనర్ ఇతర వేరియంట్‌ ల లాగా కాకుండా, ఈ కొత్త టొయోటా ఫార్చ్యూనర్ జిఆర్-ఎస్ వేరియంట్ కేవలం 4WD డ్రైవ్‌ట్రెయిన్‌ ఇంకా అలాగే ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో మాత్రమే అందుబాటులో ఉంటుంది.



అలాగే ఈ కార్ కేవలం రెండు ఎక్స్టీరియర్ కలర్లలో మాత్రమే లభిస్తుంది. వీటిలో యాటిట్యూడ్ బ్లాక్ ఇంకా అలాగే వైట్ పెర్ల్ క్రిస్టల్ అనే కలర్ ఆప్షన్లు కూడా ఉన్నాయి.అలాగే డిజైన్ పరంగా చూస్తే, కొత్త టొయోటా ఫార్చ్యూనర్ జిఆర్-ఎస్ వేరియంట్ లో ముందు వైపు మరింత అగ్రెసివ్ గా కనిపించే ఎయిర్ డ్యామ్ ఇంకా అలాగే ఫాగ్ ల్యాంప్ హౌసింగ్‌తో కొత్తగా రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ బంపర్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇంకా స్టాండర్డ్ ఫార్చ్యూనర్ వేరియంట్‌ల నుండి ఈ ఫార్చ్యూనర్ జిఆర్-ఎస్ వేరియంట్ ను వేరు చేయడానికి కంపెనీ దీని ముందు భాగంలో 'GR' బ్యాడ్జింగ్‌ను కూడా కంపెనీ మనకు అందిస్తోంది. ఇక సైడ్స్ లో డ్యూయల్-టోన్ ఫినిషింగ్‌ కు బదులుగా డార్క్ షాడోతో కూడిన కొత్త అల్లాయ్ వీల్స్‌ ను కూడా ఈ కార్ కి కంపెనీ ఉపయోగించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: