ఇవాళ తెలంగాణలో విద్యుత్ ఇంజనీర్ల జేఏసీ మహా ధర్నా నిర్వహించబోతోంది.   విద్యుత్ చట్ట సవరణ బిల్లు‎కు నిరసనగా మహాధర్నా నిర్వహిస్తున్నామని  విద్యుత్ ఇంజనీర్స్ జేఏసీ ప్రకటించింది. మహాధర్నాకు సంబంధించిన పోస్టర్‌ను జేఏసీ ఆవిష్కరించింది. కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 8న పార్లమెంట్‌లో విద్యుత్ చట్టసవరణ బిల్లును ప్రవేశపెట్టాలని చూస్తున్న సందర్బంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు విధులు బహిష్కరించాలని విద్యుత్ ఇంజనీర్స్ జేఏసీ పిలుపు ఇచ్చింది.

ఒక వేళ విద్యుత్ సరఫరా‎లో అంతరాయం వస్తే పునరుద్ధరణ పనులు చేయకుండా నిరసన తెలుపుతామని.. విద్యుత్ ఇంజనీర్స్ జేఏసీ ప్రకటించింది. ఇందుకు వినియోగదారులు సహకరించాలని విద్యుత్ ఇంజనీర్స్ జేఏసీ విజ్ఞప్తి చేసింది. విద్యుత్ బిల్లును ప్రవేశపెడితే విధులు బహిష్కరించి నిరవధికంగా సమ్మెకు దిగుతామని విద్యుత్ ఇంజనీర్స్ జేఏసీ హెచ్చరించింది. అయితే ఈ మహాధర్నాలతో నిరసనలతో కేంద్రం ప్రవేశ పెట్టే బిల్లు ఆగుతుందా.. చట్టం కాకుండా పోతుందా అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: