మానవ మేథస్సు, సృజనాత్మక శక్తి ఉండాలంటే యువత సొంతంగా ఆలోచించాలితప్ప... ప్రతిదీ గూగుల్‌పై ఆధారపడవద్దని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. అలాగే కొనసాగితే కొద్ది రోజుల్లో సొంత ఆలోచనలు పోయి నిస్తేజమవుతారని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హెచ్చరించారు. అతిగా మొబైల్‌ ఫోన్ల వాడకం కూడా సరికాదని... ప్రకృతితో మమేకమై పుస్తక పఠనంపై ప్రత్యేక దృష్టి సారిస్తే చురుకు పెరుగుతుందని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు.


అందుకోసం నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్‌లో స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యా, వైద్యం సేవలతోపాటు గ్రామీణ మహిళలు, యువత సొంత కాళ్లపై నిలబడేందుకు అవసరమైన నైపుణ్యాల పెంపు కోసం వివిధ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉపాధికి ఉత్తమ బాటలు వేస్తున్నామని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. దేశంలో జనాకర్షక పథకాల కన్నా జనహిత పథకాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు..  పేదలకు మేలు చేయాలంటే తాత్కాలిక, ఆకర్షక పథకాల అమలు బదులు శాశ్విత ప్రాతిపదికన జనహితమైన కార్యక్రమాలు ప్రవేశపెట్టిన అమలు చేయాలన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: