సహజంగా నెయ్యి అనగానే గుర్తొచ్చేది, పప్పు అన్నం. భోజన సమయంలో, ఆరోగ్య రక్షణలో నెయ్యి వాడుతారు. కేవలం నెయ్యి ఆరోగ్య సంరక్షణలో మాత్రమే కాదు, అందం సంరక్షణలో సైతం నెయ్యి ఉపయోగ పడుతుందని చాలా మందికి తెలియదు. నెయ్యి అందాన్ని మెరుగు పరచడంలో, చర్మాన్ని రక్షించడంలో ఎలా ఉపయోగ పడుతుందో తెలుసుకుంటే, అసలు నెయ్యి లో ఇన్ని సౌందర్య గుణాలు దాగున్నారా అనుకోక మానరు. ముఖ్యంగా చలి కాలంలో నెయ్యి ఇచ్చే రక్షణ అంతాఇంతా కాదు.

 

చలికాలంలో చర్మం పొడిగా మారుతుంది. ఈ ప్రభావం ముఖ్యంగా ముఖంపై కనిపిస్తుంది. పెదాలు పొడిబారిపోయి చారలు చారలుగా పగిలిపోతుంది కూడా.  ఈ క్రమంలో నెయ్యి తీసుకుని ఒంటికి పట్టిస్తూ ముఖానికి పెదవులకి కూడా పట్టించి మసాజ్ చేసుకుంటే చర్మం పొడిబారకుండా ఉంటుంది. నెయ్యిలో ఉండే విటమిన్ – ఇ చర్మాన్ని యవ్వనంగా చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

 

ఒక బకెట్ నీళ్ళలో మూడు చెంచాల నెయ్యి తీసుకుని గోరు వెచ్చని నీళ్ళలో పోసి అందులో ఆలివ్ ఆయిలో ఒక రెండు స్పూన్స్ వేసుకుని బాగా కలిపి ఆ నీటితో  స్నానం చేస్తే చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.

 

చాలా మందికి కంప్యూటర్స్ ముందు కూర్చుని ఉండటంతో కళ్ళు బాగా అలిసి పోతాయి. అలాంటి వారు కళ్ళ పై భాగంలో నెయ్యి రాసుకుని వేళ్ళతో మర్దనా చేసుకుంటే కళ్ళు ఎంతో హాయిగా అలసట వీడి ఎంతో యాక్టివ్ గా ఉంటాయి. అయితే కళ్ళలోకి నెయ్యి వెళ్ళకుండా జాగ్రత్త పడండి.


మరింత సమాచారం తెలుసుకోండి: