స్నానం చేయడం అనేది మనకు రిఫ్రెష్ ను అందిస్తుంది. అలాగే చెమట కారణంగా, బయట కాలుష్యాల కారణంగా శరీరంపై ఏర్పడిన దుమ్ము, ధూళి, మృత కణాలను తొలగించడానికి స్నానం అత్యవసరం. అంతేకాకుండా ఒత్తిడి అలసట నుంచి కూడా మనల్ని బయటపడేస్తుంది ఈ స్నానం. పూర్వం నుంచి నేటి వరకు మనలో చాలామంది బకెట్లో నీటిని నింపి వాటి ద్వారా స్నానం చేస్తుంటారు. కానీ కొంతమంది అందుకు విరుద్ధం. ప్రస్తుత కాలంలో కొంతమందిలో ఈ షవర్ కింద స్నానం చేయడం
ఫ్యాషన్ గా మారిపోయింది. షవర్ కింద స్నానం చేయడం వల్ల నీటిని కూడా వృధా చేస్తున్నారు. ఈ షవర్ కింద స్నానం చేసేటప్పుడు, ఎన్ని నీటిని మనము ఉపయోగిస్తున్నామో..కూడా తెలియకపోవడం వల్ల నీరు వృధాగా పోతుంది. కానీ ఈ షవర్ కింద స్నానం చేసేటప్పుడు మాత్రం , ఈ తప్పులు చేస్తే అనర్ధాలు తప్పవని సూచిస్తున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం..
చాలా వేడి నీటితో స్నానం చేయడం :
కొంతమందికి చాలా వేడి నీటితో స్నానం చేసే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం వల్ల చర్మం చాలా పొడిగా మారడం తో పాటు జుట్టు లోని తేమ పూర్తిగా తొలగించబడుతుంది. అలాగే జుట్టు రాలే సమస్యలు, జుట్టు పొడిబారడం, తేమను కోల్పోయి నిర్జీవంగా మారడం లాంటి సమస్యలు ఏర్పడతాయి.
జుట్టును గట్టిగా రుద్దడం :
షవర్ కింద స్నానం చేసేటప్పుడు, తల మీద ఉన్న దుమ్ము ని వదిలించుకోవడానికి గాఢత కలిగిన షాంపూలతో జుట్టుపై రుద్దుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల జుట్టు ఒత్తిడికి గురై, జుట్టు రాలడం ప్రారంభమవుతుంది.
కండిషనర్ ను తప్పించడం :
మనలో చాలామంది షాంపూ చేసిన తర్వాత కండిషనర్ల ను ఉపయోగించరు. అందుకు కారణం కండిషనర్ యొక్క నిజమైన ప్రయోజనం వారికి తెలియకపోవడం. కాబట్టి షవర్ స్నానం చేసిన తర్వాత జుట్టుకు కండిషనర్ పెట్టడం ఎంతో ముఖ్యం.