ఎప్పుడూ యవ్వనంగా కనిపించాలంటే డైట్‌లో చేర్చుకోవాల్సిన ఆహార పదార్థాల్లో నారింజ మొదటి స్థానంలో ఉంటుంది. మిటమిన్ సీ పుష్కలంగా ఉండే ఈ పండ్లను క్రమం తప్పకుండా తినడం వల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. అంతేకాకుండా వీటి ద్వారా చర్మం డీహైడ్రేట్‌కు గురికాకుండా కూడా ఉంటుంది.అలాగే యాపిల్స్‌ను తీసుకుంటే డాక్డర్ అవసరం రాదని చాలా మంది ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఇందులో ఉండే విటమిన్ ఏ ఇంకా సీలతో పాటు యాంటీ యాక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం ఇంకా ఫైబర్ మీ చర్మానికి రక్షణ ఇస్తుంది. దాదాపు 92 శాతం నీరు ఉండే పుచ్చ కాయలు చర్మానికి ఎంతగానో మేలు చేస్తాయి. అంతేకాకుండా ఇందులోని విటమిన్ సీ, ఏ, బీ1 చర్మానికి మంచి కాంతినిస్తుంది. వయసుతో పాటు చర్మంపై వచ్చే ముడతలకు ఇది చెక్ పెడుతుంది.సిట్రస్ ఫ్యామిలీకి చెందిన నిమ్మకాయలు కూడా చర్మానికి బాగా ఉపయోగపడతాయి.
నిమ్మరసాన్ని ముఖానికి అప్లై చేసుకుంటే మెటిమలు ఇంకా మచ్చలు తగ్గుతాయనే విషయం తెలిసిందే. అయితే నిమ్మరసం రూపంలో తాగడం వల్ల కూడా ఇది చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇక వేసవి వచ్చిందంటే ముందుగా గుర్తొచ్చే మామిడి పండ్లు కూడా చర్మానికి ఎంత గానో చేస్తాయి. ముఖ్యంగా ఇందులో ఉండే విటమిన్ ఏ, ఈ, సీ, కే, ఫ్లెవనాయిడ్స్ చర్మాన్ని ఎల్లప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాకుండా చర్మాన్ని ఎప్పుడూ కూడా చాలా హైడ్రేట్‌గా ఉండేలా చూసుకుంటాయి.కీర దోసకాయ కూడా చర్మానికి ఎంతగానో మేలు చేస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్‌లు, విటమిన్ సీ, కేలు చర్మం ప్రకాశవంతంగా మెరవడానికి ఎంతగానో దోహదపడతాయి.ఇక ఎప్పుడూ యవ్వనంగా కనిపించాలంటే డైట్‌లో చేర్చుకోవాల్సిన మరో ఫ్రూట్ దానిమ్మ. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల చర్మం చాలా ప్రకాశవంతంగా మారుతుంది. ఇందులోని విటమిన్స్ ఇంకా మినరల్స్.. యూవీ కిరణాల వల్ల చర్మానికి జరిగే డ్యామేజ్‌ను బాగా తగ్గిస్తుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: