ఈ మధ్యకాలంలో గ్రేహైయర్ అనేది ప్రతి ఒక్కరికి ఉన్న సమస్యల్లో చాలా పెద్దదని చెప్పవచ్చు. తెల్ల జుట్టును తగ్గించడానికి రకరకాల కెమికల్ ప్రొడక్ట్స్ డైలీ వాడుతూ ఉంటారు.అయితే రసాయనాలు ఎక్కువగా ఉండే జుట్టు ఉత్పత్తులను వాడటం వలన కూడా జుట్టు సమస్యలు అధికం అవుతాయి.ఈ హెయిర్ ప్రొడక్ట్స్‌లో ఉండే సల్ఫేట్‌లు జుట్టుకు కొన్ని ప్రయోజనాలు చేకూర్చినప్పటికీ,దుష్ప్రభావాలు కూడా కలుగుతాయి. కావున వీటి వల్ల జుట్టు అధికంగా పొడిబారి,తొందరగా పాడైపోయేలా చేస్తుంది.అంతేకాక జుట్టును తెల్లగా మారుస్తుంది.

వీటన్నిటికి ఎలాంటి దుష్ప్రభావాలు లేని న్యాచురల్ ప్రాడక్టుతో డైలు వేసుకోవడం వల్ల,ఆరోగ్యంగా మరియు అందంగా పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.మరీ ముఖ్యంగా ఆవాల నూనెలో కొన్ని పదార్థాలను కలిపి వేసుకోవడం వల్ల తొందరగా నల్లబడుతుందని కూడా చెబుతున్నారు.మరి ఆ పదార్థాలేంటో,ఆ ప్యాక్ ఎలా వేసుకోవాలో మనం తెలుసుకుందాం పదండి..

ఈ ప్యాక్ కోసం కావాల్సిన పదార్థాలు ఒక గిన్నెలో ఆవాల నూనె తీసుకోవాలి.దీనితో పాటు కలబంద ముక్క,కొన్ని కరివేపాకు,అర స్ఫూన్ ఉల్లిపాయలు పేస్ట్,ఒక టీ స్ఫూన్ గోరింటాకు పొడి,ఒక టీస్పూన్ నల్ల జీలకర్ర పక్కన పెట్టుకోవాలి.

ఈ ప్యాక్ సిద్ధం చేయడానికి ఒక కడాయి తీసుకొని అందులో ఆవాల నూనెను వేసి వేడి చేయాలి.ఆ నూనె వేడెక్కిన తరవాత పైన చెప్పిన అన్ని పదార్థాలను కలపాలి.10-15 నిమిషాలు వేడి చేయాలి.అది బాగా ఊడికిన తర్వాత ఇనుప పాత్రలో పోసి చల్లారనివ్వాలి. ఇది బాగా చల్లారిన తర్వాత పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు ఈ ప్యాక్ ను మాడుకు పట్టించి సున్నితంగా మసాజ్ చేయాలి.ఈ ప్యాక్ బాగా రాసుకుని 2 గంటల తర్వాత తలస్నానం చేయాలి.ఈ ప్యాక్ తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలు జుట్టును నల్లగా మార్చడమే కాక, జుట్టుకుదురులకు రక్తప్రసరణ జరిగిబలంగా దూడంగా తయారవుతుంది.దీనితో పాటు కొత్త జుట్టు పెరగడానికి కూడా దోహదపడుతుంది. ఉత్తమ ఫలితాల కోసం,ఈ ప్యాక్ ను వారానికి రెండుసార్లు వేసుకోవాలి.మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే,వెంటనే ఈ చిట్కా పాటించి చూడండి.మరియు జుట్టు సంరక్షణకు ఉపయోగించే ప్రోడక్ట్లలో  సల్ఫేట్ లేని ప్రాడక్టులు వాడడం ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి: