తెలుగు చిత్రసీమలో ఉన్న ప్రముఖ బడా నిర్మాతలలో సి.కళ్యాణ్ ఒకరు. నందమూరి కంపౌండ్ నిర్మాతగా పేరు తెచ్చుకున్న ఆయన చిత్రసీమలో అందరికీ తలలో నాలుకలా మెలుగుతూ అందరివాడు అనిపించుకుంటారు. నందమూరి కంపౌండ్ అనడానికి కారణం ఏమిటంటే ఆయన ఎక్కువగా బాలయ్యతో సినిమాలు చేశారు. టాలీవుడ్ లో చిన్న నిర్మాతగా కెరీర్ మొదలు పెట్టిన కళ్యాణ్ నేడు టాలీవుడ్ లో అగ్ర హీరోలతో సినిమాలు చేసే స్థాయికి ఎదిగారు.

నెల్లూరు జిల్లాలో జన్మించిన కళ్యాణ్ చిత్రసీమలో పైకి రావాలన్న ఆశతో మద్రాసు చేరుకున్నారు. దొరికిన అవకాశాన్ని సద్వినియోగ పరచుకుంటూ కొన్ని చిన్న చిత్రాల నిర్మాణంలో భాగమయ్యారు. కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే శ్రీహరి హీరోగా నటించడం బలరాం చిత్రం కళ్యాణ్ నిర్మాణంలో రూపొంది మంచి విజయం సాధించింది. ఆయన ఎక్కువగా సోదరుడు శ్రీ వెంకటేశ్వర రావు నిర్మాతగా తాను మాత్రం సమర్పకుడిగా చిత్రాలు నిర్మించారు. కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామ చిత్రంతో కళ్యాణ్ నిర్మాతగా తొలి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత తన సొంత మానసిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాతలతో కలిసి మహేష్ బాబుతో ఖలేజా చిత్రం, నాని మూవీ ఎటో వెళ్ళిపోయింది మనసు, వరుణ్ తేజ్ లోఫర్, సాయి ధరమ్ తేజ్ ఇంటెలిజెంట్, ఛార్మి జ్యోతిలక్ష్మి, రాజశేఖర్ తో కలిగి వంటి సినిమాలతో పాటు కొన్ని డబ్బింగ్ సినిమాలను కూడా టాలీవుడ్ కు అందించారు. ఇక బాలకృష్ణ తన సినిమాల విషయానికొస్తే దాసరి నారాయణరావు దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా పరమవీరచక్ర అనే చిత్రాన్ని నిర్మించారు. ఆ తర్వాత బాలయ్య జై సింహ, రూలర్ వంటి చిత్రాలను నిర్మించారు.

ఇక సి కళ్యాణ్ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా మాత్రమే కాకుండా చాంబర్లో అనేక శాఖలు కీలక పాత్రలు పోషించారు. సౌతిండియా ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడిగా కూడా చేశారు. అంతే కాకుండా ఆయన ఆలిండియా ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు గాను ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన సత్య దేవత గాడ్సే సినిమా నిర్మిస్తున్నారు. మరోవైపు బాలకృష్ణతో రామానుజాచార్య అనే చిత్రం నిర్మించే ఆలోచనలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: