మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. రైలు పట్టాలపై నిద్రిస్తున్న వలస కూలీలపై గూడ్స్ రైలు దూసుకెళ్లిన ఘటనలో 15 మంది దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఈ హృదయ విదారక ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇలా జరగడం అత్యంత బాధాకరమని ఆయన ట్వీట్ చేశారు. ఈ ఘటనలో మరణించిన వారికి సంతాపాన్ని ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో తాను మాట్లాడినట్లు చెప్పారు. ప్రమాద ఘటనపై, అక్కడి పరిస్థితులపై మంత్రి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు ప్రధాని తెలిపారు. సాధ్యమైనంత మేర, అవసరమైనంత వరకు సాయం చేస్తామని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.