సినిమా ఇండస్ట్రీని విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఓ వైపు కరోనా మహమ్మారి భయం.. మరోవైపు ఇలా వరుస విషాదాలతో ఇండస్ట్రీ అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు మరణంతో సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకోగా.. తాజాగా సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. టాలీవుడ్‌ నిర్మాత కొడాలి వెంకటేశ్వరరావు సతీమణి అనిత మంగళవారం అనారోగ్యంతో కన్నుమూశారు. మండలి కార్యదర్శిగా పనిచేసిన కొడాలి వెంకటేశ్వరరావుతో పాటు ఈమె కూడా కొన్ని చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. వెంకటేశ్వరరావు- అనితల కుమార్తె స్వాతి గతంలో జనియర్ ఎన్టీఆర్ నటించిన రామాయణం మూవీలో రావణుడిగా నటించి అలరించింది. అయితే అనిత అకాల మరణంపై సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. కొడాలి వెంకటేశ్వరరావుకు సినీ పరిశ్రమలోని ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ తొలి సినిమా బాల రామాయణం. ఈ సినిమా 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.  ఆ సినిమాలో రావణుడిగా స్వాతి నటించి అలరించింది. అప్పట్లో ఈ సినిమాకు ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ అవార్డు కూడా వచ్చింది. ముఖ్యంగా రాముడిగా జూనియర్ ఎన్టీఆర్ నటన విమర్శకుల ప్రశంసలతో పాటు తాతకు తగ్గ మనవడు అనే గుర్తింపు కూడా తీసుకొచ్చింది. ఇందులో నటించిన చాలామంది బాల నటులు ఇప్పుడు ఇండస్ట్రీలో లేరు. ఎవరికి వాళ్ళు సపరేట్ ప్రొఫెషన్స్ ఎంచుకొని అందులో రాణిస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: