గత కొద్ది రోజుల క్రితం ఒక యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసులో అతడికి బెయిల్ లభించింది, జైలు నుంచి విడుదలయ్యారు. కానీ తాజాగా మరో కేసు నిమిత్తం ఆయనని నిన్న అర్ధరాత్రి అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.. లక్ష్మీకాంత శర్మ అనే జ్యోతిష్యుడు కొన్ని నెలల క్రితం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. లక్ష్మీకాంత శర్మ తీన్మార్ మల్లన్న తనను డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేశారని డబ్బులు ఇవ్వకపోవడంతో తన మీద దుష్ప్రచారం చేశారంటూ ఫిర్యాదు చేశారు..దీనికి సంబంధించి ఇప్పటికే రెండు సార్లు నోటీసులు ఇచ్చామని అయితే తీన్మార్ మల్లన్న నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతోనే అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్నారు. ఈరోజు మేజిస్ట్రేట్ ముందు మల్లన్నను హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: