బాలీవుడ్ లో దాదాపుగా ఏడాది నుంచి డ్రగ్స్ వ్యవహారం అనేది సంచలనంగా మారుతూనే ఉన్నాయి. టాలీవుడ్ లో కూడా ఈ డ్రగ్స్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. డ్రగ్స్ వ్యవహారం విషయంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై నేడు కూడా కొనసాగనున్న వాదనలలో ఏ పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉందా అనే దానిపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.

సాయంత్రం గం. 4.00కు విచారణ ప్రారంభం అవుతుందని తెలుస్తుంది. ఆర్యన్‌తో పాటు అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచా బెయిల్ పిటిషన్లపై కూడా విచారణ జరుగుతుంది. రెండ్రోజులు సాగిన విచారణలో వాదనలు వినిపించారు నిందితుల తరఫు న్యాయవాదులు. ఆర్యన్ తరఫున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. నేడు కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ వినిపించనుంది ఎన్సీబీ.

మరింత సమాచారం తెలుసుకోండి: