తెలంగాణ లో శాసన మండలి ఎన్నికల కోలాహలం ఆరంభంమైంది. స్థానిక సంస్థలకు జరుగుతున్న ఎన్నక కావడంతో అధికార పార్టీ తన సభ్యులను క్యాంప్ లో ఉంచింది. రాజన్న సిరిసిర్ల జిల్లా కేం ద్రం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో రాష్ట్ర మంత్రి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన వెంట ఎవరిని తెచ్చుకున్నారో తెలుసా ?
స్థానిక సంస్థల కోటా శాసన మండలి సభ్యుల ఎన్నికల పోలింగ్ లో తెలంగాణ రాష్చ్ర మంత్రి తన మందీ మార్బలంతో వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ని పోలింగ్ కేంద్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు తనయుడు , రాష్ట్ర మంత్రి తారక రామారావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిరిసిర్ల పట్టణంలో ని కౌన్సిలర్ లు, జిల్లా కు చెందిన ప్రజా ప్రతినిథులు దాదాపు రెండు వందల మందితో కలసి ఆయన చిన్న ఊరేగింపుగా పోలింగ్ కేంద్రంలోకి వచ్చారు. ఏందబ్బా ఇంద జనం అని అక్కడి వారు ఒకింత ఆశ్చర్యపోయారు. దీనికి కారణం ఉంది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఈ జిల్లాలోని 200 మంది ఓటర్లనూ వారం పదిరోజులుగా క్యాంపులో ఉంచింది. మంత్రి కెటిఅర్ వారందరినీ బస్సులో నేరుగా పోలింగ్ కేంద్రం వద్దకు తీసుకు వచ్చారు. మందీ మార్బలంతో వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి