రంగుల పండుగ హోలీ అంతా ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. హోలీ రోజు రంగుల్లో మునిగితేలడం మామూలే.. ఈ రంగుల పండుగను కుటుంబ సభ్యులతో, మిత్రులతో జరుపుకుంటారు. అయితే.. ఈ సారి మాత్రం హోలీని కాస్త ప్రత్యేకంగా జరుపుకోవాలని కేంద్రం సూచిస్తోంది. హోలీ వేడుకలకు ముందు మీ అమ్మలతో కలిసి భోజనం చేసి ఆ తర్వాత పండుగ జరుపుకోవాలని కేంద్రం సూచిస్తోంది.

మీ అమ్మతో భోజనం చేసి ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలని కేంద్రం సూచిస్తోంది. ఇలా పంచుకున్న ఫొటోల్లో కొన్నింటిని భారత ప్రభుత్వం తన అధికారిక సామాజిక ఖాతాల్లో ప్రదర్శిస్తుందట. ఈ కొత్త కాన్సెప్ట్ కోసం కేంద్రం ప్రధాని మోడీ తన తల్లితో కలసి భోం చేస్తున్న ఫోటోను ఉదాహరణగా చూపించింది. మీరు కూడా ఇలా మీ అమ్మతో కలసి భోజనం చేయండని సూచిస్తోంది.  మరి ఈ కేంద్రం సూచనను ఎంత మంది పాటిస్తారో.. ఎన్ని ఫోటోలు పంపుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: