టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అక్కినేని నాగచైతన్య పలు విభిన్న లుక్స్‌లో కనిపించనున్న సినిమా 'థ్యాంక్‌ యూ' .రాశీఖన్నా, అవికాగోర్‌ ఇంకా మాళవిక నాయర్‌ కథానాయికలు. విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జులై 8న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం టీజర్‌ను రిలీజ్ చేసింది.విభిన్న ప్రేమకథతో ఈ సినిమా రూపొందుతున్నట్టు ప్రచార చిత్రంలో చూపించిన సీన్లు చూస్తే అర్థమవుతోంది. క్లాస్‌ అండ్ మాస్‌ గెటప్‌లో చైతన్య కనిపించిన తీరు అందరినీ ఆకట్టుకునేలా ఉంది.


ప్రతి సంభాషణలో కూడా విక్రమ్‌ కుమార్‌ మార్క్‌ కనిపిస్తుంది. అలాగే తమన్‌ అందించిన నేపథ్య సంగీతం వినసొంపుగా ఉంది. ఈ సినిమాని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సూపర్‌హిట్‌ సినిమా 'మనం' తర్వాత విక్రమ్‌- చైతన్య కాంబినేషన్‌లో వస్తుండటంతో 'థ్యాంక్‌ యు' సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: