తెలంగాణ నిరుద్యోగులకు కేసీఆర్ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్‌ చెప్పేసింది. వైద్యారోగ్య శాఖలో 1326ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ డైరెక్టరేట్‌లో 751 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు ఈ నోటిఫికేషన్‌లో ఉన్నాయి. ఇదే నోటిఫికేషన్‌లో  వైద్య విద్య డైరెక్టరేట్ లో 357ట్యూటర్ పోస్టులు కూడా ఉన్నాయి. తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో 211 సివిల్ సర్జన్ జనరల్ పోస్టులు కూడా ఈ నోటిఫికేషన్‌లో ఉన్నాయి. ఐపిఎంలో 7సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు కూడా ఈ నోటిఫికేషన్‌లో  ఉన్నాయి. వైద్య ఆరోగ్య శాఖ నియామక మండలి
ఈ  నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఇప్పటికే తెలంగాణలో అనేక నోటిఫికేషన్లు వచ్చాయి. మరికొన్ని నోటిఫికేషన్లు రాబోతున్నాయి. గ్రూప్‌ వన్‌, ఎస్సై పోస్టులకు పరీక్ష తేదీలు కూడా వచ్చేశాయి. గ్రూప్‌ వన్ పరీక్షను అక్టోబర్‌ 16 నిర్వహించాలని ఇటీవలే టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: