రాష్ట్రంలో సర్పంచులను చూసి రాష్ట్ర ప్రభుత్వం భయపడుతుందని రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు బాబు రాజేంద్రప్రసాద్‍ అంటున్నారు. సర్పంచులు తలపెట్టిన శాంతియుత సమరశంఖారావం కార్యక్రమానికి పోలీసులు దమనఖాండను ఊపయోగించి ఆపారాని బాబు రాజేంద్రప్రసాద్‍  ఆరోపించారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా బలవంతంగా అరెస్టులు చేయడం హేయమైన చర్య అని బాబు రాజేంద్రప్రసాద్‍  ఎద్దేవా చేశారు.


శాంతియుతంగా కాలినడకన తిరుమలకు వెళుతున్న సర్పంచులను, రాష్ట్ర నాయకులను అడ్డుకోవడం ఏమిటని బాబు రాజేంద్రప్రసాద్‍  ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అటంకం కలిగించినప్పటికి 60 మంది సర్పంచులు, రాష్ట్ర నాయకులు శ్రీవారిని దర్శించుకుని సమరశంఖారావం పూరించామని బాబు రాజేంద్రప్రసాద్‍  తెలిపారు. తమ  12 డిమాండ్లు తమ కోసం కాదని రాష్ట్రంలోని 12 వేల గ్రామాల అభివృద్ది కోసమని బాబు రాజేంద్రప్రసాద్‍  ఆయన అన్నారు. సర్పంచులు గ్రీన్‍ అంబాసిడర్లకు జీతాలు, విద్యుత్‍ బకాయిలు చెల్లించవద్దని బాబు రాజేంద్రప్రసాద్‍ పిలుపు ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: