మంత్రి అంబటి రాంబాబు మరోసారి పవన్‌ పై విమర్శలు ఎక్కు పెట్టారు. అమ్ముడు పోయింది నువ్వు కాదా సకలకళా వల్లభా అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. రెండు మూడు దేశాలు, రెండు మూడు భాషలు వచ్చిన వాళ్లను పెళ్లిళ్లు చేసుకున్న వపన్‌కళ్యాణ్‌ కంటే సకలకళా కోవిదులు, సకలకళా వల్లభులు ఎవరైనా ఉంటారా అని మంత్రి అంబటి రాంబాబు నిలదీశారు.

నేను అడిగే కొన్ని ప్రశ్నలకు పవన్‌కళ్యాణ్‌ సమాధానాలివ్వాల్సిన పరిస్థితి ఉందన్న మంత్రి అంబటి రాంబాబు.. నోవాటెల్‌లో పవన్‌ను చంద్రబాబు కలిసి మాట్లాడాడని... పవన్‌ ఏమో బాబు హైద్రాబాద్‌లో ఉండగా, వారింటికి వెళ్లి మరీ కలిసొచ్చాడని గుర్తు చేశారు. పవన్‌ రాజకీయంలో రహస్యాలేమీ ఉండవు అంటున్నాడని.. మరి ఇన్నిసార్ల బాబు, పవన్‌ల కలయికల్లో ఏం మాట్లాడుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి కదా అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: