వీధి రౌడీలా కొట్టండ్రా.. నరకండ్రా.. అని మాట్లాడిన చంద్రబాబుకు పవన్ కల్యాణ్ వత్తాసు పలుకడం ఏంటని వైసీపీ ఎంపీ నందిగం సురేశ్‌ ప్రశ్నిస్తున్నారు. అంజూ యాదవ్ అనే మహిళా సీఐ.. జనసేన పార్టీ నేత నోటికొచ్చినట్టు దూషిస్తే.. వెధవ అని చెంప దెబ్బకొడితే.. పెద్ద నేరం జరిగిందని పవన్ కల్యాణ్ ఎస్పీకి ఫిర్యాదు చేశాడని.. మరి పుంగనూరు అల్లర్లలో టీడీపీకి చెందినవారు దాడులకు పాల్పడి, 40 మంది పోలీసుల్ని కొడితే.. మాత్రం పవన్‌ ఎందుకు ప్రశ్నించలేదని వైసీపీ ఎంపీ నందిగం సురేశ్‌  నిలదీశారు.


ప్రశ్నించకపోగా చంద్రబాబుకు మద్దతుగా ఖండన ఇచ్చి, తన దత్త తండ్రికి తానెప్పుడూ మద్దతు ఇస్తానని చెప్పుకుంటున్నాడని వైసీపీ ఎంపీ నందిగం సురేశ్‌  ఎద్దేవా చేశారు. పోలీసుల వాహనాలు ధ్వంసం చేసి, పోలీసులపై దాడి చేసి, వారి రక్తం కళ్ళ చూస్తే.. పోలీసులపైన జరిగిన దాడులను ఖండించటానికి పవన్ కు మనసు రాలేదా అని వైసీపీ ఎంపీ నందిగం సురేశ్‌  ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: