వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు, ఆర్గానిక్ పంటలు, విత్తనాల అభివృద్ధిని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని మోదీ సర్కారు భావిస్తోంది. ఈ లక్ష్యంతో జాతీయ స్థాయిలో మూడు మల్టీస్టేట్ కోపరేటివ్ సొసైటీలను ఏర్పాటు చేసింది. జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన నేషనల్ కోపరేటివ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్, నేషనల్ కోపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్, భారతీయ బీజ్ సహకారి సమితి లిమిటెడ్ సంస్థలను మల్టీ స్టేట్ కోపరేటివ్ సొసైటీ యాక్ట్ కింద రిజిస్టర్ చేసింది. దేశవ్యాప్తంగా వివిధ స్థాయిల్లో కార్యకలాపాలు చేపడుతున్న ఆసక్తి కలిగిన సహకార సంఘాలు మల్టీస్టేట్ కోపరేటివ్ సొసైటీల్లో సభ్యులుగా చేరడానికి అర్హులు.


నేషనల్ కోపరేటివ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ (ఎన్‌సీఈఎల్)ను ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోపరేటివ్ లిమిటెడ్ (ఇఫ్‌కో), క్రిషక్ భారతి కోపరేటివ్ లిమిటెడ్ (క్రిభ్కో), నేషనల్ అగ్రికల్చర్ కోపరేటివ్, మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (నాఫెడ్), గుజరాత్ కోపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్, నేషనల్ కోపరేటివ్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ సంస్థల ప్రోత్సాహంతో కేంద్రం ఏర్పాటు చేసింది.  ఒక్కో సంస్థ అందించిన 100 కోట్ల రూపాయల ఆర్థిక సహకారంతో మొత్తం 500 కోట్ల ప్రాథమిక మూలధనంతో ఏర్పాటు చేసిన ఎన్‌సీఈఎల్‌కు 2000 కోట్లు అధీకృత షేర్ కేపిటల్‌గా నిర్ణయించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: