ఆమె ఓ శిష్యురాలు.. గ్రూప్‌-1 కోచింగ్‌ కోసం అనంతపురం నుంచి హైదరాబాద్‌కు వచ్చింది. కోచింగ్ సంగతి ఎలా ఉన్నా..కోచింగ్‌ సెంటర్‌లోని ఓ ఫ్యాకల్టీపై మనసు పారేసుకుంది. అతన్ని ప్రేమిస్తున్నానంటూ వెంటపడింది. కోచింగ్ సెంటర్ ఫ్యాకల్టీని పెళ్లి చేసుకోవాలని కోరిన యువతి యువతి అతడు సానుకూలంగా స్పందించకపోవడంతో తెగ ఫీలైపోయింది. ఇప్పటికే పెళ్లయిందని అతడు వారించినా వినలేదు. అంతే కాదు.. అతడు కాదన్నాడని చుక్కలు చూపించింది.

ప్రేమను తిరస్కరించాడని గురువు కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని వేధింపులు ప్రారంభించింది.  సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టి గురువు కుటుంబాన్ని వేధించింది. గురువు కుటుంబసభ్యుల ఫోటోలు సేకరించి మార్ఫింగ్ చేసి సతాయించింది. సామాజిక మాధ్యమాల పోస్టులపై సదరు గురువు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో గురువును వేధిస్తున్న యువతిని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమించాలి.. కానీ.. అవతలి మనిషి స్పందన ఏంటో కూడా తెలుసుకోకుండా మూర్ఖంగా ప్రవర్తిస్తే పర్యవసానాలు ఇలాగే ఉంటాయని గుర్తించాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: