సామజిక మాధ్యమాల పుణ్యమా అంటూ తప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. నిజాలు రాయాలి, అవే ప్రచారం చేయాలి అనే నియమనిబంధనలకు తిలోదకాలు ఇస్తూ, కొన్ని సామజిక మాధ్యమాలు స్వప్రయోజనాల కోసం అనేక తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కనీసం విలువలు పాటించని వారికి ఎప్పటికప్పుడు నోటీసులు ఇస్తూ వస్తున్నారు ఆయా అధికారులు. కేవలం తమ ఇష్టానికి విషపు వార్తలను ప్రచారం చేస్తూ ఉన్న సంస్థలు కూడా ఇందుకు ప్రధాన కారణం కాదు. వాటి వెనుక అనేక రాజకీయ, పెట్టుబడిదారుల హస్తం ఉన్నట్టు భావిస్తున్నారు.

కొన్ని కొన్ని సార్లు ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తున్న వారిపై పరువు నష్టం దావాను వేస్తుంటారు. అయినా వినకుండా వాళ్ళు చేసిన తప్పులని చేస్తూనే ఉన్నారు. తాజాగా నష్టాలలో నడుస్తున్న ఎయిర్ ఇండియా ను టాటాకు కట్టబెడుతున్నట్టు వచ్చిన తప్పుడు వార్తలపై కేంద్రం స్పందించింది. కానీ ఆయా మీడియాలలో ఈ వార్త హల్ చల్ చేస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్రం తప్పుడు వార్తలపై స్పందించింది. దీనికి జవాబుగా టాటా ఎయిర్ ఇండియా బిడ్డింగ్ రేస్ లో లేదని స్పష్టం చేసింది.  ఇటువంటి అబద్దపు వార్తలను రాస్తున్న, ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకొంటామని స్పష్టం చేసింది.

ఎన్నో ఏళ్ళ తరువాత ఎయిర్ ఇండియా మళ్ళీ టాటా సొంతం అవుతుందని వివిధ సామజిక మాధ్యమాలలో కధనాలు వచ్చాయి. 43వేల కోట్ల నష్టాలలో నడుస్తున్న ఎయిర్ ఇండియా ను కేంద్రం వదిలేస్తుందనే ప్రయత్నం చేయగా దానిని కొనుక్కుంటానికి స్పైస్ జెట్ , టాటా లాంటి సంస్థలు సిద్ధంగా ఉన్నాయి అని ఆయా కధానాలలో ప్రచారం చేశారు. ఈ వార్త చూసిన కేంద్రపెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తులు నిర్వహణ విభాగం కార్యదర్శి సామజిక మాధ్యమాలలో స్పష్టత ఇచ్చారు. ఎయిర్ ఇండియా బిడ్డింగ్ ఇంకా పూర్తి కాలేదని, దానిపై ఇంకా కేంద్రం ఆలోచనలో ఉందని మీడియాకు స్పష్టం చేశారు. ఇలాంటి అబద్దపు వార్తల ప్రచారం నేరం అని దానికి శిక్షార్హులు అవుతారని ఆయన స్పందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: