సాధారణ రైళ్లలో ప్రయాణికులు చాలా మంది మాములు టిక్కెట్లు తీసుకోని ప్రయాణం చేస్తుండేవారు. ఇందులో ముఖ్యంగా రెండవ తరగతిలో ప్రయాణించేవారు ఎక్కువ మంది ఉండటం జరిగేది. వాళ్ళు కూడా సాధారణ టికెట్ తో ప్రయాణం చేస్తూ వచ్చారు. ఇదంతా కరోనా తో మార్పుకు గురైంది. ఆర్థికపరమైన విషయాలు కావచ్చు లేదా వైరస్ ఉన్నదని కావచ్చు రెండవ తరగతి ని కూడా రిజర్వేషన్ కిందకు తెచ్చారు. తద్వారా కరోనా మార్గదర్శకాలతో ప్రయాణాలు కొనసాగించే విధానం ప్రవేశపెట్టారు. ఇక్కడ వరకు బాగానే ఉన్నప్పటికీ, వచ్చిన చిక్కు మొత్తం రిజర్వేషన్ చార్జీలతోనే ముడిపడి ఉంది. రిజర్వేషన్ అన్నారు కానీ దానికి ప్రత్యేకంగా చార్జీలు ఉండటం గతంలో ఉన్నట్టుగా ఉంటుందా లేదా సాధారణం టికెట్ ధరలకే రిజర్వేషన్ చేస్తారా అనే సందేహం ఉంది.

దీనిపై ప్రస్తుతం ప్రభుత్వం ఒక స్పష్టత ఇచ్చేసింది. రిజర్వేషన్ చార్జీలు తప్పకుండ ఉంటాయని అదికూడా రెండో తరగతి ప్రయాణికులకు కూడా ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. పార్లమెంట్ సమావేశాలలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఈ విధంగా జవాబు ఇచ్చారు. కరోనా సందర్భంగా ఇచ్చిన ఏవైనా సడలింపులు తప్పించి, సాధారణ రైళ్లలో కూడా రెండో తరగతి ప్రయాణాలు రిజర్వేషన్ పద్దతిలోనే సాగుతాయని, వాటికీ రిజర్వేషన్ రుసుము ఉంటుందని ఆయన తెలిపారు. అంటే ఎక్కడకు టికెట్ తీసుకున్నప్పటికీ, మొత్తం ఈ చార్జీలు చెల్లించాల్సిందే. అలా వద్దు అనుకున్నవారు సాధారణ తరగతి బోగీలో ప్రయాణించాల్సి ఉంది.

కరోనా సమయంలో రైల్వే శాఖ 2020-21 కి గాను 364 సాధారణ రైళ్లను కూడా ఎక్స్ ప్రెస్ రైళ్ళగా మార్చేసింది. ఈ వర్గీకరణ వలన వివిధ రైళ్లలో ప్రయాణాలపై మార్పులు చోటుచేసుకున్నాయి. అయితే టికెట్ ధరలలో ఎటువంటి మార్పులు లేకపోయినప్పటికీ, రిజర్వేషన్ చార్జీలు మాత్రం తప్పట్లేదు. ఇక వేగం పెంపు అనేది వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆయా అంశాలు సర్దుబాటులోకి రావడం జరిగిన తరువాతనే వేగం పెంపు అనేది నిర్దారణకు రావడం జరుగుతుంది. ఇది బాగానే ఉన్నప్పటికీ, కనీసం జనరల్ బోగీల సంఖ్య పెంచితే సాధారణ ప్రయాణికులకు మేలుగా ఉంటుంది అనేది ప్రయాణికుల అభిప్రాయం. దానికి తగ్గట్టుగా రెండో తరగతిలో కూడా బోగీలు పెంపు ఉంటె బాగుంటుంది. గతంలో మాదిరి అక్కుపెన్సీ కుదరదు కాబట్టి, దానికి తగ్గట్టుగా బోగీలు పెంచితే సౌకర్యంగా ఉంటుంది. ప్రయాణికుల నుండి స్పందన అంటే రిజర్వేషన్ లు ఎక్కువగా జరుగుతుంటే దానికి తగ్గట్టుగా బోగీలను పెంచే యోచన రైల్వే శాఖ చేపట్టవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: