ఇండియాలో ప్రముఖ ప్రైవేట్ ఇన్స్యూరెన్స్ కంపెనీ అయిన రిలయన్స్ జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (RGICL) సరికొత్త హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీని  ప్రకటించింది.ఇక రిలయన్స్ హెల్త్ గెయిన్  పేరుతో ఆరోగ్య బీమా ప్లాన్‌ను ప్రకటించింది. ఇది "అత్యంత అనువైన ఇంకా కస్టమర్లు తమకు కావాల్సినట్టు మార్చుకునే అవకాశం ఉన్న హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ" అని కంపెనీ చెబుతోంది. ఈ పాలసీలో ప్రత్యేకత ఏంటంటే కస్టమర్లు వారి అవసరానికి అనుగుణంగా మంచి ఫీచర్లను ఎంచుకోవచ్చు. ఎంచుకున్న ఫీచర్స్‌కి మాత్రమే వారు డబ్బులు చెల్లించొచ్చు. రూ.3 లక్షల నుంచి రూ.1 కోటి దాకా కవరేజీ ఎంచుకునే అవకాశం ఉంది. 18 ఏళ్ల నుంచి 65 ఏళ్ల వరకు వయస్సు ఉన్నవారెవరైనా కానీ ఈ పాలసీ తీసుకోవచ్చు.రిలయన్స్ హెల్త్ గెయిన్ పాలసీ ద్వారా ప్లస్, పవర్ ఇంకా అలాగే ప్రైమ్ పేరుతో మూడు వేర్వేరు ప్లాన్స్ అందిస్తోందని ప్రతి కస్టమర్ కోసం పాలసీ కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉందని ఇంకా అలాగే దీంతో రిలయన్స్ జనరల్ అన్ని వయస్సులు ఇంకా వర్గాల వైద్య అవసరాలను తీర్చడమే లక్ష్యంగా పెట్టుకుందని రిలయన్స్ జనరల్ హెల్త్ ఇన్స్యూరెన్స్ ఓ ప్రకటనలో తెలిపింది.



ఇక రిలయన్స్ హెల్త్ గెయిన్ హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ వివరాలు చూస్తే ఇందులో 38 రకాల ఫీచర్స్ ఉంటాయి. సమ్ ఇన్స్యూర్డ్ కన్నా రెండు రెట్లు కవరేజీ పొందే ఛాన్స్ ఉంది.అలాగే పాలసీ సంవత్సరంలో ఎన్నిసార్లు క్లెయిమ్ చేసుకున్నా రీస్టోరే చేసుకోవచ్చు. ఇంకా గ్యారెంటీడ్ క్యుములేటివ్ బోనస్ లభిస్తుంది. క్లెయిమ్ తర్వాత కూడా బోనస్ పొందేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది.ప్రీఎగ్జిస్టింగ్ డిసీజ్ అంటే ముందుగానే ఏవైనా వ్యాధులు ఉంటే మూడేళ్లు ఇంకా రెండేళ్లు లేదా ఒక ఏడాది కూడా వెయింటింగ్ పీరియడ్ ఎంచుకోవచ్చు. రూ.3,00,000 లోపు హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకోవడానికి వయస్సు పరిమితి కూడా ఏమీ లేదు. కాబట్టి ఆరోగ్య బీమా లేని వృద్ధులు రక్షణ కోసం హెల్త్ గెయిన్ ని ఎంచుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: