స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు పలు రకాల సేవలు అందిస్తోంది.అందులో డిపాజిట్లు కూడా  భాగమే. దీని వల్ల కస్టమర్లకు రాబడి లభిస్తుంది. కేవలం ఎస్‌బీఐ నుంచి సేవలు పొందటం మాత్రమే కాకుండా ఎస్‌బీఐ షేర్లు కొన్న వారికి కూడా సూపర్ ప్రాఫిట్ లభిస్తోంది. ఇప్పటికే ఎస్‌బీఐ షేరు మంచి జోరు మీద ఉంది. అంతేకాకుండా రానున్న రోజుల్లో స్టేట్ బ్యాంక్ షేరు మరింత పైకి కదిలే అవకాశం ఉంది. ప్రముఖ ఫారిన్ బ్రోకరేజ్ కంపెనీ జెఫరీస్ ఈ విషయాన్ని వెల్లడిచింది. ఎస్‌బీఐ షేరుపై ఈ బ్రోకరేజ్ సంస్థ చాలా బుల్లిష్‌గా ఉంది. రానున్న రోజుల్లో ఎస్‌బీఐ షేరు ధర మరింత పెరగొచ్చని అంచనా వేస్తోంది. ఇదే జరిగితే డబ్బులు పెట్టినోళ్లకు, అలాగే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలని భావించే వారికి భారీ లాభాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎస్‌బీఐ షేరు ధర రానున్న రోజుల్లో రూ.700 స్థాయికి చేరొచ్చని జెఫరీస్ అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఎస్‌బీఐ స్టాక్ ధర రూ. 560కి పైన కదలాడుతోంది. అంటే షేరు ధర భారీగా పెరగనుందని చెప్పుకోవచ్చు. జెఫరీస్ మాత్రం ఎస్‌బీఐ స్టాక్‌పై చాలా బుల్లిష్‌గా ఉంది. కొనుగోలు చేయొచ్చని సిఫార్సు చేస్తోంది.


బై రేటింగ్ ఇచ్చింది.ఇదివరకు జెఫరీస్ ఎస్‌బీఐ స్టాక్‌కి టార్గెట్ ధరను రూ. 630గా నిర్ణయించింది. అయితే ఈ టార్గెట్ ప్రైస్‌ను ఇప్పుడు తాజాగా రూ. 700 పెంచేసింది. గత ఏడాది కాలంలో ఎస్‌బీఐ తన ఇన్వెస్టర్లకు దాదాపు 21 శాతం రాబడిని ఇచ్చింది. అలాగే ఈ ఏడాది ఇప్పటి వరకు చూస్తే బ్యాంక్ దాదాపు 22 శాతం లాభాన్ని అర్జించి పెట్టింది. గత 26 నెలల కాలంలో చూస్తే ఎస్‌బీఐ షేర్లు కళ్లుచెదిరే ప్రాఫిట్ అందించాయి. 2020 మే 22న ఎస్‌బీఐ షేరు ధర రూ. 150 వద్ద ఉండేది. ఇప్పుడు ఏకంగా రూ. 568 స్థాయి వద్ద కదలాడుతోంది. అంటే 26 నెలల కిందట ఎవరైనా ఎస్‌బీఐ షేర్లలో రూ. లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ విలువ రూ. 3.76 లక్షలకు చేరి ఉండేది. అంటే ఎస్‌బీఐ షేర్లు కళ్లుచెదిరే రాబడి అందించాయని చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో కూడా మంచి ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: