పెళ్లి అనేది ప్రతి ఒక్కరికి ఒక మధురమైన జ్ఞాపకం అన్న విషయం తెలిసిందే. అందుకే మనసుకు నచ్చిన వ్యక్తిని ఇక కలకాలం తోడు నీడగా ఉంటాడు అని నమ్మకాన్ని కలిగించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ఎంతో మంది ఇష్ట  పడుతూ ఉంటారు. ముఖ్యంగా ఆడపిల్లలకు అయితే పెళ్లి సరికొత్త జీవితాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. ఇక ఎన్నో బరువు బాధ్యతలను కూడా ఆడపిల్లకు తెచ్చి పెడుతూ ఉంటుంది అని చెప్పాలి. అప్పటి వరకు పుట్టినింట్లో గారాబం గా పెరిగిన ఆడపిల్ల ఇక కోటి ఆశలతో అత్తారింట్లో అడుగు పెడుతుంది.


 అందుకే పురుషుల కంటే మహిళలకు పెళ్లి అనేది మరింత ప్రత్యేకమైనది అని చెప్పాలి. అయితే ఇక్కడ ఒక మహిళకు మాత్రం పెళ్లి అనేది కేవలం ఒక కమర్షియల్ ఎలిమెంట్ గా మాత్రమే మారి పోయింది. పెళ్లి అనే బంధం లోకి అడుగు పెట్టి సాఫీగా భర్త తో సంతోషం గా ఉండకుండా అందిన కాడికి దోచుకుపోయింది. ఈ ఘటన బెంగళూరులో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి ఓటీసీ రోడ్డుకు చెందిన షణ్ముఖం అనే 69 ఏళ్ల వ్యక్తి భార్యకు విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటున్నాడు.


 అతనికి తమిళనాడుకు చెందిన మల్లికా అనే 35ఏళ్ల మహిళ పరిచయమైంది. ఇక తనను రెండవ వివాహం చేసుకోవాలి అంటూ షణ్ముగంను కోరగా.. అతను కూడా అంగీకరించాడు. వీరిద్దరికీ పెళ్లి జరిగింది. ఇక అతని ఇంట్లోనే ఇటీవల వివాహం చేసుకున్నారు.  తోడుగా వచ్చిన వ్యక్తి కమిషన్  గా 35000 తీసుకొని వెళ్ళిపోయాడు. అయితే కొన్నాళ్ల వరకు షణ్ముగంతోనే  కలిసి ఉండి.. ఆ తర్వాత ఇంట్లో 64 గ్రాముల బంగారం.. 700 గ్రాముల వెండి వస్తువులు కొంత నగదు తీసుకొని కనిపించకుండా పోయింది. చుట్టుపక్కల వెతికిన షణ్ముగం  చివరికి మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: