ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా దొంగలు బెడద ఎక్కువైపోయింది అన్న విషయం తెలిసిందే. ఇక ఉద్యోగం వ్యాపారం చేసుకుని వచ్చిన దాంట్లో సర్దుకుపోయి బతకడం కంటే.. ఇక ఎంతో చాకచక్యంగా చోరీలకు పాల్పడి అందిన కాడికి దోచుకుని జల్సాలు చేయడానికి ఎక్కువగా మోగుచూపుతున్నారు నేటి రోజుల్లో కొంతమంది జనాలు. వెరసి ఇక ఇంటికి తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్ గా చేసుకొని దారుణంగా చో్రీలు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి.


 అయితే నేటి రోజుల్లో తాళం వేసి ఉన్న ఇల్లు ఇక భారీగా డబ్బులను భద్రపరిచిన బ్యాంకులు మాత్రమే కాదు చివరికి దేవాలయాలను సైతం వదలడం లేదు కొంతమంది నీచులు. దేవుడి గుడిలోకి చొరబడి మరి ఇక హుండీ ఎత్తుకెళ్లడం లేదా విలువైన ఆభరణాలను అపహరించడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక వ్యక్తి ఇలాంటిదే చేసాడు. ఏకంగా రాధాకృష్ణుల వెండి ఆభరణాలను ఎత్తుకు వెళ్ళాడు. అయితే ఇలా ఎత్తుకు వెళ్ళిన వారు ఎవరైనా సరే వాటిని అమ్మి వచ్చిన డబ్బుతో జల్సాలు చేయడం చేస్తూ ఉంటారు. కానీ కొన్నెళ్ల తర్వాత మళ్లీ ఆ దొంగ ఆభరణాలను తిరిగి ఇచ్చేసాడు.


 సినిమాల్లో ఇలా దేవాలయంలో చోరీ చేసిన దొంగకు దేవుడే బుద్ధి వచ్చేటట్లు చేసి.. మళ్లీ నగలు అప్పగించేలా చేస్తూ ఉండడం లాంటి సీను చూస్తూ ఉంటాం. ఇక ఇప్పుడు నిజ జీవితంలో కూడా ఇలాంటిదే జరిగింది అని చెప్పాలి. ఒడిస్సా లోని గోపీనాథ్ పూర్ ఆలయంలో రాధాకృష్ణుల వెండి ఆభరణాలను దొంగలించిన ఒక దొంగ.. దాదాపు 9 ఏళ్ల తర్వాత వాటిని తిరిగి ఇచ్చేసాడు. ఇక ఇలా చోరీ చేసినందుకు 200 రూపాయలు జరిమానాగా గుడిలో పెట్టి వెళ్ళాడు. 2014లో చోరీ జరగగా.. ఆభరణాలు చోరీ చేసినప్పటి నుంచి తాను ఎంతో శిక్షను అనుభవించానని.. ఆ దొంగ రాసిన లేఖలో పేర్కొన్నాడు. అయితే ఇన్నేళ్లుగా దొరకని నగలు ఇప్పుడు స్వయంగా దొంగే తెచ్చి ఇవ్వడంతో ఇదంతా దేవుడు లీల అని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: