కావాల్సిన పదార్థాలు:
క్యారెట్‌లు- 4
బంగాళాదుంపలు-4
టమాటాలు-2
పచ్చిమిర్చి-2


కారం-1 టేబుల్‌ స్పూన్‌
పసుపు-1/2 టేబుల్‌ స్పూన్‌
ఉప్పు-తగినంత
అల్లం - కొద్దిగా


జీల కర్ర-1 టేబుల్‌ స్పూన్‌
నూనె-3 టేబుల్‌ స్పూన్లు
గరం మసాలా-6 టేబుల్‌ స్పూన్లు
ధనియాల పొడి-3 టేబుల్‌ స్పూన్లు


తయారీ విధానం:
ముందుగా బంగాళాదుంపలు, క్యారెట్‌ తొక్కు తీసి పెద్ద ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. టమాటాలు, అల్లం, పచ్చిమిర్చి కూడా కట్‌చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌ పై బాణలి పెట్టి నూనె వేసి వేడెక్కిన తర్వాత జీలకర్ర, కట్‌చేసి పెట్టుకున్న క్యారెట్‌, బంగాళాదుంప ముక్కలు వేసి స్లో ఫ్లేమ్‌పై ఉడికించాలి. 


ఆ తర్వాత గరం మసాలా, ధనియాల పొడి, కారం వేసి రెండు నిమిషాలు ఉడికించి దించేయాలి. అంతే ఎంతో రుచిక‌ర‌మైన, వేడి వేడి ఆలూ క్యారెట్‌ కుర్మా రోటీలోనూ లేదా రైస్‌లోనూ తింటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. క్యారెట్ మ‌రియు ఆలూలో అనేక పోష‌కాలు ఉంటాయి. ఈ రెండిటి కాంబినేష‌న్‌లో ఆలూ క్యారెట్ కుర్మా తిన‌డం వ‌ల్ల చాలా మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: