ఒకవైపు కరోనా తీవ్రత పెరుగుతుంది.. మరో వైపు కామాంధుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. పిచ్చి కోరికల తో ఉన్న ఓ కామాంధుడు వృద్దురాలి పై కన్నేశాడు. తన కోరికను తీర్చమని వేధించాడు. అందుకు ఆమె నిరాకరించింది. తను చేస్తుంది తప్పు అని సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. అయిన కూడా ఆ కామాంధుడు అస్సలు పట్టించు కోలేదు.. దీంతో భయబ్రాంతులకు గురైన ఆమె ఊర్లో వారికి జరిగిన విషయాన్ని చెప్పింది. అందరూ కలిసి అతన్ని మందలించారు.. 


ఆమెను బలవంతంగా ఓ ప్రదేశానికి తీసుకెళ్లాడు. కాళ్లు, చేతులు, తల భాగాలను నరికి .. వాటిని అక్కడే కాల్చాడు. మొండెం భాగాన్ని మాత్రం ఓ బస్తాలో వేసుకొని అక్కడ నుంచి బయలుదేరాడు. ఆ మొండెం ను ఊరు శివారు లో పడేద్దామనుకున్నాడు. స్నేహితుడికి ఫోన్ చేసి రప్పించాడు. ఆ బస్తా నుంచి దుర్వాసన వస్తుందని అది ఏంటని అడగ్గా అది కాల్చిన అడవిపంది అని సమాధానం ఇచ్చాడు. దానిని రైల్వే ట్రాక్ పై పడేసి చేతులు దులుపుకున్నారు.. 


అతని స్నేహితుడికి అనుమానం వచ్చి మూటను తెలిసి చూసాడు.. అందులో శవం ఉండటంతో భయపడిన అతను పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం బజ్యాతండాకు చెందిన వృద్ధురాలు అజ్మీర నాజీ నివాసం ఉంటుంది. నాజీ భర్త 20ఏళ్ల క్రితం మరణించాడు. నాజీ కొంత మతి స్థితిమితం కోల్పోయి కుమారుల వద్ద ఉండకుండా కారేపల్లి లో రహదారుల వెంట, రైల్వేస్టేషన్‌, ఇతర ప్రాంతంలో తలదాచుకుంటూ తిరిగేది.. ఆమె పై కన్నేసిన అతను కోరిక తీరలేదని అక్కసు తో ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డాడు.. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రి తరలించి, నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: