కరీంనగర్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ కారు అదుపు తప్పి బావిలో పడిపోయింది. అయితే ఆ కారులో ప్రయాణిస్తున్న ఓ రిటైర్డ్ ఎస్ఐ ప్రాణాలు కోల్పోయాడు. ఇక పోలీసులు, ఫైర్ సిబ్బంది 9 గంటలపాటు శ్రమించి కారును బయటికి తీశారు. కాగా.. కారును వెలికి తీసేందుకు పొద్దంతా శ్రమించిన ఓ ఫైర్ ఆఫీసర్ సోదరుడే మృతుడు కావడం అందరినీ కంటతడి పెట్టించింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్, హుప్నాబాద్ రహదారిలోని ఓ వ్యవసాయ బావిలో కారు పడిపోయిందని చిగురుమామిడి పోలీసులకు సమాచారం అందించారు. ఇక వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ డిపార్ట్ మెంట్ అధికారులు కారును బయటకు తీసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేపట్టారు. అయితే క్రేన్ల సాయంతో కారును బయటకు తీస్తున్న క్రమంలో జారి నీటిలోనే పడిపోతూనే ఉంది. దాంతో మూడు భారీ మోటార్లు, జనరేటర్ తెప్పించి బావిలోని నీటిని తోడించారు. రాత్రి 8 గంటల తరువాత కారును బయటికి తీశారు.

అయితే బావి నుంచి కారును వెలికితీసిన పోలీసులు లోపల ఒక్కడే ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ఇక మృతుడు రిటైర్డ్ ఎస్సై పాపయ్యనాయక్‌గా పోలీసులు గుర్తించారు. ఆయన వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్ట నర్సింగాపూర్ శివార్లలోని ఓ తండాకి చెందిన వ్యక్తి. అయితే పాపయ్య నాయక్ కరీంనగర్ నుండి తన స్వగ్రామానికి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఇక చిగురుమామిడి మండలం చిన్నముల్కనూర్‌ సమీపంలో కారు అదుపుతప్పడంతో వ్యవసాయ బావిలో పడింది. అయితే ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా.. ఉదయం నుండి రాత్రి వరకు కారును బయటకు తీసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసి చివరకు సఫలమైయ్యారు. ఈ ఘటనా స్థలానికి  కరీంనగర్ జిల్లా అధికారులు చేరుకొని పర్యవేక్షించారు. అలాగే.. ఫైర్ డిపార్ట్ మెంట్‌లో పని చేస్తున్న మానుకొండూరు ఫైర్ ఆఫీసర్ బుదయ్య కూడా విధి నిర్వహణ కోసం సంఘటన స్థలానికి చేరుకున్నారు.

అంతేకాదు.. ఉదయం నుండి రాత్రి వరకూ బావి నుండి కారును బయటకు తీసేందుకు అందరితో పాటు శ్రమించాడు బుదయ్యా. ఆయన గుర్తు తెలియని వ్యక్తి కారు అన్న ఆలోచనతోనే విధుల్లో మునిగిపోయింది. ఇక చివరకు కారు బయటకు తీసిన తరువాత మృతదేహాన్ని చూసి ఆయన షాక్ కు గురైయ్యారు. చనిపోయింది అన్నానే అని తెలిసి కన్నీరుమున్నీరుగా విలపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: