ఇటీవలే ఓ యువకుడు వైద్యుల దగ్గరికి వచ్చాడు.. ఇక యువకుడిని పరీక్షించిన వైద్యులు అతని కడుపులో బంగారు ఉండలు ఉండడం చూసి ఒక్కసారిగా షాకయ్యారు. దీంతో చికిత్స చేసి ఇక బంగారాన్ని కడుపులో నుంచి బయటకు తీశారు. ఇంతకి అతని కడుపులోకి బంగారు ఉండలు ఎలా వచ్చాయి అని ఆలోచిస్తున్నారు కదా.. వాటంతట అవి కడుపులో కి రాలేదు. అతనే కడుపులో బంగారు ఉండలను పెట్టుకున్నాడు. చివరికి  పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. ఇటీవల కాలంలో ఎంతో మంది పోలీసుల కళ్లుగప్పి బంగారాన్ని అక్రమంగా తరలించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎయిర్పోర్టులో ఎంతో మంది అక్రమార్కులు అధికారులకు పట్టుబడుతూ చివరికి జైల్లో కి వెళ్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.


 అయితే అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ అక్రమార్కులు ఆటలు కట్టిస్తున్నప్పటికీ ఎక్కడ ఎవరు వెనకడుగు వేయడం లేదు. పోలీసుల కళ్లుగప్పి ఏదో ఒక విధంగా అక్రమాలకు పాల్పడలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది   ఏకంగా ఒక ప్రయాణికుడి కడుపులో బంగారు ఉండలు ఉండడాన్ని గుర్తించిన అధికారులు ఏకంగా వైద్యుల సాయంతో వాటిని బయటకు తీశారు.. తమిళనాడులోని కోయంబత్తూరు లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవలే కోయంబత్తూర్ విమానాశ్రయానికి ఉదయం సమయంలో షార్జా నుంచి వచ్చిన విమాన ప్రయాణికులను అధికారులు తనిఖీలు చేశారు


 అయితే ఇలా అధికారులు తనిఖీలు చేస్తున్న సమయంలో ఓ యువకుడు అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో అధికారులు అతన్ని గట్టిగా ప్రశ్నించడంతో పొంతన లేని సమాధానాలు చెబుతూ వచ్చాడు. స్కాన్ మిషన్ తో అతని స్కాన్ చేయగా కడుపులో ఏకంగా మూడు  ఉండలు ఉన్నట్లు తేలింది. వాటిల్లో పేస్టు చేసిన బంగారం  తరలించినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఇక వైద్యుల సహాయంతో వాటిని బయటకు తీయించారు  ఈ ఘటనలో 32 లక్షల విలువైన 640 గ్రాముల బంగారాన్ని స్వాధీనం  చేసుకున్న పోలీసులు నిందితున్ని అరెస్టు చేసి కటకటాల వెనక్కి తోసారూ.

మరింత సమాచారం తెలుసుకోండి: