ప్రేమించి కొద్ది రోజులు ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేయడం.. లేదా? వారి ప్రేమను జీవితం మొత్తం కావాలని భావించె వాళ్ళు పెళ్ళి కూడా  చెసుకుంటారు. అయితే మొదట్లో కొద్ది రోజులు బాగానే ఉన్నా తర్వాత ఒకరిపై మరొకరు ద్వెషాన్ని పెంచుకోవడం చిన్న చిన్న కారణాల ద్వారా గొడవలు పడటం. ఆ తర్వాత కోపంతో మరొకరిని చంపడానికి ప్రయత్నించి జైలు శిక్ష అనుభవిస్తున్న ఘటనలు ఎన్నో ఈ మధ్య వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరో ఘటన కూడా వెలుగులొకి వచ్చింది.


ప్రేమ జంట ప్రెమించుకున్నారు, పెళ్ళి కూడా చేసుకున్నారు. అయితే పెళ్ళి చేసుకున్న నెలకే భార్యను భర్త అతి దారుణంగా చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. పెళ్ళి చెసుకొనీ నెల కూడా అవ్వకముందే భర్త భార్యపై కత్తితో దాడి చెయ్యడం అందరినీ ఆలోచనలో పడేసింది. అసలు ఎందుకు భర్త ఇలా చేశాడు. వేరే ఏదైనా కారణం ఉందా? లేక చిన్న కారణం వల్లే అతను భార్యా పై దాడి చేశాడా? అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..


ప్రకాశం జిల్లాలోని దర్శి మండలం పోతవరంలో దారుణం వెలుగు చూసింది. భార్య పై అతి కిరాతకంగా కత్తితో దాడి చేశారు. ప్రస్తుతం అమె పరిస్థితి విషమంగా మారింది. వివరాల్లొకి వెళితే... బాధితురాలి పేరు పావని.. వీరిద్దరు జనవరి 18 న ప్రేమ వివాహం చేసుకున్నారు.భర్త వేధిస్తున్నాడని పావని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో కోపోద్రిక్తుడైన భర్త సాయికుమార్‌.. పావనిపై కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. అయితే పెళ్ళి అయిన నెల లోపే ఇలాంటి దారుణం వెలుగు చూడటం అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురిచెస్తుంది.భార్యభర్తల మధ్య గొడవకు మరేదైన కారణం ఉందేమోనని స్థానికులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన పై పూర్తీ వివరాలు తెలియాల్సి ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: