నేటి రోజుల్లో ఎక్కడ చూసినా మోసాలకు పాల్పడుతున్న మనుషులే కనిపిస్తున్నారు. కానీ నిజాయితీగా ఉండే మనుషులు ఎక్కడా కనిపించడం లేదు. కేవలం పురుషులు మాత్రమే కాదు పురుషులకు మేము ఎక్కడ తక్కువ కాదు అనుకుంటున్నారేమో మోసాలకు పాల్పడడంలో మహిళలు కూడా పోటీ పడుతున్నారు  ఇక తమ అందాలను ఎరగా వేసి ట్రాప్ చేసి మరీ డబ్బులు గుంజుతున్నారు  అన్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో ఇలాంటి తరహా ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. అప్పటికే ఎంతో మంది అమాయకులు రోజురోజుకు ఇలాంటి హనీ ట్రాప్ ల బారిన పడుతున్న ఘటనలు పెరిగిపోతూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.


  ఒక అందమైన అమ్మాయి నుంచి మొదట ఫోన్ వస్తుంది. ఆ తర్వాత ఆ అమ్మాయి ఎంతో తీయగా మాట్లాడుతుంది. మాటలు కలిపి ముగ్గులోకి దింపుతుంది. నా సర్వస్వం నీకే అంటూ నమ్మిస్తుంది. ఒక్కసారైనా ఆమెతో గడపాలనే కోరికను కలిగిస్తుంది. చివరికి పొరపాటున ఆమె ఉచ్చులో పడ్డాము అంటే ఇక ఏదో ఒక విధంగా లక్షలు కాజేస్తూ ఉంటుంది. ఇటీవలే ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. హైదరాబాద్ నగరంలోని ఘట్కేసర్ లో ఉంటున్నా కందుల వంశి అనే 25 ఏళ్ల వ్యక్తి రోజా ను పెళ్లి చేసుకున్నాడు. జూన్ 27వ తేదీన రోజా మియాపూర్ కు చెందిన ఒక ఉద్యోగి కి ఫోన్ చేసింది.


 ఇక ఇంట్లో ఎవరూ లేరని వస్తే రాత్రంతా ఎంతో సుఖంగా గడపవచ్చు అంటూ అవతలి వ్యక్తిలో ఎంతగానో ఆశ కల్పించింది. దీంతో అమ్మాయి  పిలిచిన తర్వాత అతను ఊరుకుంటాడా ఎగేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇలా నమ్మి ఇంట్లోకి వచ్చిన కాసేపటికే తన భర్త, సోదరి దేవి, మరో పరిచయస్తుడు వర్మ అక్కడికి చేరుకొని అతని రౌండప్ చేశారు. దీంతో అతని మాట్లాడనీయకుండా చితకబాదారు. తర్వాత అతని కార్డుల నుంచి 2.2 లక్షల రూపాయలు కాజేశారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించగా నిందితులని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sex