ఇటీవలే కాలంలో పెంపుడు జంతువులను పెంచుకోవడం అనేది ట్రెండ్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొంతమంది ఇష్టం లేకపోయినప్పటికీ ట్రెండ్ ఫాలో అవ్వాలి అనే ఉద్దేశంతో ఇక పెంపుడు జంతువులను పెంచుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మరి కొంతమంది కాస్త కొత్తగా ప్రయత్నించి అందరూ పెంచుకునే కుక్కలు, పిల్లులను కాకుండా వేరే జంతువులను పెంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. కొంతమంది ఏకంగా పాములను సైతం పెంచుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.


 ఇక ఇటీవలే రాజస్థాన్లో ఒక వింత ఘటన వెలుగులోకి వచ్చింది. అని చెప్పాలి సాజన్ గడ్ అనే ప్రాంతంలో పడ్ల వాడ్కియా అనే గ్రామంలో ఒక వ్యక్తి నివసిస్తున్నాడు. అందరిలా కుక్కను పిల్లిని కాకుండా సదర వ్యక్తి ఒక ఎలుకను పెంచుకోవడం మొదలుపెట్టాడు. ఎలుకను ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు. కాగా ఎక్కడికి వెళ్ళినా ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండేవాడు అని చెప్పాలి. అయితే ఇలా అపురూపంగా చూసుకుంటూ ఎలుక ఓ రోజు కనిపించకుండా పోయింది. ఇంట్లో అంతా వెతికాడు. ఇక చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఎలుక ఆచూకీ కోసం గాలించిన ఉపయోగం లేకుండా పోయింది.


 దీంతో ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. ఇక అక్కడ పోలీసులకు తన ఎలుక కనిపించడం లేదు అంటూ ఫిర్యాదు చేయడంతో ఖాఖీలు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు అని చెప్పాలి. ఎలుక బరువు 700 గ్రాములు ఉంటుందని తన పెంపుడు ఎలుక మిస్సింగ్ వెనుక తన సోదరుల పిల్లల హస్తం ఉండవచ్చు అంటూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు సైతం అవాక్కయ్యలా చేసింది అని చెప్పాలి.  ఇక తొలుతా పోలీసులు దీని పెద్దగా పట్టించుకోలేదు. కానీ పట్టు విడవకుండా అతను పోలీసులకు తలనొప్పి తీసుకురావడంతో చివరికి కేసు నమోదు చేశారు. ఇక ఇందుకు సంబంధించిన కేసు విచారణ కూడా చేపట్టారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: