
ఇక తమకు నచ్చిన వస్తువు తక్కువ ధరకే వస్తూ ఉండడంతో ఇక వెంటనే ఆర్డర్ పెట్టడం లాంటివి చేశారు అని చెప్పాలి. కొంతమంది ఇలా ఆర్డర్ చేసి ఇక తామ కొన్న వస్తువు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తే.. చివరికి డెలివరీ అయిన తర్వాత మాత్రం చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఎందుకంటే ఒక వస్తువు ఆర్డర్ చేస్తే ఇంకా ఏదో పార్సల్లో వస్తూ ఉండడం నేటి రోజుల్లో ఎక్కువగా జరుగుతుంది. ఇటీవల ఒక వ్యక్తికి ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ఒక వ్యక్తి అక్టోబర్ 15వ తేదీన ఈ కామర్స్ వెబ్సైట్లో ఒక లాప్టాప్ ఆర్డర్ చేశాడు. ఆ లాప్టాప్ పై మంచి ఆఫర్ ఉండడంతో ఇక వెంటనే ఆర్డర్ పెట్టేసాడు.
కానీ ఆ తర్వాత మాత్రం ఆర్డర్ డెలివరీ అయిన తర్వాత ఓపెన్ చేసి చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఏకంగా లాప్టాప్ వస్తుంది అనుకుంటే అందులో ఒక పెద్ద రాయితో పాటు ఎలక్ట్రానిక్ వ్యర్ధాలు కూడా ఉన్నాయి. వెంటనే కస్టమర్ కేర్ కి ఫోన్ చేసి సమస్యను చెప్పిన ఉపయోగం లేకుండా పోయింది. ఇక ఎంతో కష్టం మీద తిరిగి తన డబ్బులను రిఫండ్ పొందాడు అని చెప్పాలి. దీనికి సంబంధించిన ఫోటోలను సదరు వ్యక్తి సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయాయి. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువ కావడంతో ఈ కామర్ సంస్థలు ఓపెన్ బాక్స్ డెలివరీ ఆప్షన్ను తీసుకొచ్చాయి. కస్టమర్ కొరితే ఐటం డెలివరీ చేసేముందు డెలివరీ చేసే వ్యక్తి పార్సల్ తెరిచి చూపించాల్సి ఉంటుంది.