
ఇకపోతే వేధింపులకు గురి చేసే ఆకతాయిల పట్ల ఎలా వ్యవహరించాలి అనేదానికి నిదర్శనంగా ఇక్కడ ఒక వీడియో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. తనను అసభ్యంగా తాకిన ఒక ఆకతాయికి ఇక్కడ ఒక మహిళ బుద్ధి చెప్పిన తీరు చూసి ప్రతి ఒక్కరు కూడా ఫిదా అయిపోతున్నారు. ఆడపిల్ల అంటే ఇలాగే ఉండాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏకంగా తనను అసభ్యంగా తాకిన ఆకతాయికి చితక్కొట్టింది సదరు మహిళ. ఆమె కొట్టిన కొట్టుడుకి చివరికి అతని ప్రాణాలు పోతాయేమో అని వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అనిపిస్తుంది.
ఇంతకీ వైరల్ గా మారిపోయిన వీడియోలో ఏముందంటే... ఒక బేకరీలో మహిళ కూర్చుని తన ఫోన్ చూస్తుంది. ఇంతలో అటువైపుగా వెళ్తున్న ఒక యువకుడు ఆమె నడుమును అసభ్యంగా తాకాడు. సదరు యువతి కోపంతో ఊగిపోయింది. ఒక్కసారిగా లేచి అతని పట్టుకుని పిడి గుద్దులు గుద్దింది. కింద పడేసి తన్నుతూ పంచులు ఇచ్చింది. కొందరు ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించిన అస్సలు వినలేదు. చివరికి దెబ్బలు తాళలేకపోయిన యువకుడు బతుకు జీవుడా అంటూ అక్కడ నుంచి పరుగులు పెట్టాడు. ఈ వీడియో అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో ట్విట్టర్లో వైరల్ గా మారిపోయింది.