చంద్రబాబు అరెస్టుపై టిడిపి నేతలు కార్యకర్తలు అనుకూల వ్యక్తులు ఇక తాడోపేడో తేల్చుకోవాలని అనుకుంటున్నారు. అక్రమంగా చంద్రబాబు ను అరెస్టు చేసి జైల్లో వేశారని ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం పై విమర్శలు చేసిన టిడిపి నాయకులు కార్యకర్తలు అనుకూలంగా వ్యాపారం చేసుకునేవారు ఇప్పుడు సరి కొత్త విధానాన్ని ఎంచుకున్నారు.


చంద్రబాబు నాయుడు వల్ల తాము ఎంతో లబ్ధి పొందామని ఆయన చేసిన కృషి వల్లే తాము ఈ స్థాయిలో ఉన్నామని కాబట్టి ఆయనకు ఎలాగైనా సరే తమ వంతు సాయం చేయాలని ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. కొంత మంది కార్యకర్తలు వైసిపి నాయకులకు గానీ కార్యకర్తలకు గానీ ఎలాంటి సాయం చేయకూడదని నిర్ణయించుకున్నారు.


అలాంటిదే జెనెక్స్ అనే సంస్థ టిడిపి హయాంలో తమ ఉనికి ప్రారంభమైందని కాబట్టి వైసిపి నాయకులకు గాని కార్యకర్తలకు గానీ ఎలాంటి సాయం చేసేది లేదని బహిరంగంగానే ప్రకటించారు. దీంతో టిడిపి అనుకూల వ్యాపార సంస్థ అని అర్థమయిపోయింది ఇలాంటి విషయాల్లో ఇంకా ఎంతమంది బయటకు వస్తారు. ఇంకా ఎంతమంది వ్యాపారులు వైసీపీకి సాయం చేయమని ప్రకటిస్తారని చూడాల్సి ఉంది. ముఖ్యంగా చంద్రబాబుతో లబ్ధి పొందినటువంటి వ్యాపారులు ఇలా ప్రవర్తిస్తే 50 రోజుల్లో వైసీపీతో లబ్ధి పొందినటువంటి వారు టిడిపి వారికి సాయం చేయమని చెబితే రాష్ట్రంలో వాతావరణం మరింత ఉధృతంగా మారే అవకాశం ఉంది.


కాబట్టి రాజకీయ రంగు పొలముకున్నటువంటి కేసుల్లో సామాన్య ప్రజలు గారి వ్యాపారులు గాని జోక్యం చేసుకోవడం వల్ల నష్టపోయేది సామాన్యులే. కాబట్టి రాజకీయపరంగా నడుస్తున్న కేసు విషయం దృష్టిలో అనవసరమైన విషయాలకు వెళ్లి ఇబ్బందులు ఎదుర్కోవడం తప్ప మరే అవకాశం ఉండదు. కాబట్టి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తూ అనుకూలంగా ప్రవర్తించిన పర్వాలేదు. కానీ ఇంకొకరికి వ్యతిరేకంగా చేస్తామని చెప్పడం మాత్రం సరి కాదని భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: