కొన్ని దేశాల్లో హిందువులను అసలు గుర్తించరు. హిందు మతాన్ని అసలు పట్టించుకోరు. అలాంటిదే బెల్జియం దేశం. అక్కడ ఇతర మతస్థులను గుర్తించరు. నాన్ రిలీజస్ కింద మాత్రమే చూస్తారు. వారు సంప్రదాయాలను పట్టించుకోరు. ఏ విధమైన గుర్తింపు ఉండదు. దీనిపై బెల్జియంలోని హిందువులు అక్కడి ప్రభుత్వానికి నివేదన చేసుకున్నారు. బెల్జియంలో హిందువులను గుర్తించాలని కోరారు. హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని అడిగారు. హిందూ సంప్రదాయాలను గౌరవించాలని అభ్యర్థించారు.


అయితే బెల్జియంలో ఇతర మతస్థులను నాన్ రిలీజస్ గానే పరిగణిస్తారు. కేవలం వారిని ఇతర మతాల వారిగా చూస్తారు. ఇలా చూడటం వల్ల ఆయా దేశాల్లో ద్వితీయ శ్రేణి పౌరులుగా జీవించాల్సి వస్తోంది. కాబట్టి హిందువులు బెల్జియం లో తమను గుర్తించాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరారు. దీనికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకరించాలని వేడుకుంటున్నారు.


విదేశాల్లో ఇలాంటి పరిస్థితి ఉందంటే ఏమో అనుకోవచ్చు. కానీ ఇండియాలో కూడా రాబోయే రోజుల్లో పశ్చిమ బెంగాల్, కేరళ లాంటి రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే హిందువుల సంఖ్య కేరళలో ఇప్పటికే తగ్గిపోయింది. కేరళలో హిందువులు మైనార్టీలోకి పడిపోయారు. ఇలా పడిపోవడంతో తమను కూడా గుర్తించాలని తమకు అన్నింట్లో అవకాశం కల్పించాలని, పండగలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని హిందు సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవాలని అనుకున్న ప్రభుత్వాల అనుమతి కోరాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది.


రాబోయే రోజుల్లో పశ్చిమ బెంగాల్ లో కూడా హిందువులు ఇలా పండగలు చేసుకోవాలన్న కూడా అనుమతి తీసుకోవాలేమో అని అంటున్నారు. ఎందుకంటే జనాభా తగ్గినపుడు ఆ మతానికి గుర్తింపు అనేది రోజు రోజుకు తగ్గిపోతూ ఉంటుంది. ఇలా జరుగుతున్న విధానంలో ప్రభుత్వాలను ఏ మతం అయినా అభ్యర్థించక తప్పదు. బెల్జియంలో ఎన్నో ఏళ్లుగా ఉంటున్న హిందువులకు అక్కడి ప్రభుత్వాలు ఏ మాత్రం అవకాశం ఇవ్వడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: