రష్యా, యూరప్ దేశాలకు సంబంధించిన మీడియా అంతా కూడా ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన వార్తలతోనే ముందుకు వెళుతుంది. ఇవాళ రష్యా ఓడిపోయింది, గెలిచింది, ఈవేళ  ఎంత మంది చనిపోయారు రష్యాకు సంబంధించిన ఎన్ని వాహనాలు ధ్వంసం అయ్యాయి అని లెక్కలు మాట్లాడుకుంటున్నాయి. అదే సందర్భంలో రష్యాకు సంబంధించిన మీడియా ఉక్రెయిన్ లొంగిపోయింది, పడిపోయింది, ఈరోజుతో దాని పని అయిపోయింది అంటూ ఇట్లాంటి వార్తలను రష్యాకు సంబంధించిన మీడియా ఇస్తుంది.


అలాగే ఇక్కడ  జగన్ కి, బీజేపీకి, అదేవిధంగా కేసీఆర్ కు అనుకూల మీడియా, వ్యతిరేక మీడియా కూడా ఉన్నాయి. అలాగే అంతర్జాతీయంగా కూడా ఇదే పద్ధతి జరుగుతుంది. ఇప్పుడు ఒక పబ్లిసిటీ గేమ్ జరుగుతుంది. మనకు టెలిగ్రామ్ ఛానల్లో ఇప్పుడు కొన్ని చానల్స్ పుట్టుకొచ్చాయి. రష్యా కి సంబంధించిన సంస్థలకు టెలిగ్రామ్ చానల్స్ ను ఇవ్వడం లేదు. వాటిలో పుతిన్ రేపు చచ్చిపోతాడు, ఎల్లుండ చచ్చిపోతాడు, క్యాన్సర్ వచ్చింది, రాత్రికి చచ్చిపోతాడు అంటూ వార్తలు చెబుతున్నారు.


మొన్న బెలూరస్ అధ్యక్షుడు పుతిన్ ని కలిసినప్పుడు వాళ్ళిద్దరి మీటింగ్ ని లైవ్ ఇచ్చాడు. దాంట్లో పుతిన్ కూర్చుని కాళ్ళను అటు ఇటు కదుపుతూ కనిపించాడు. దాని గురించి అప్పుడు చానల్స్ ఒకలా రాస్తే, ఈరోజు టెలిగ్రామ్ చానల్స్ లో రేపే ఆపరేషన్ అదిగో అయిపోతాడు పుతిన్ అంటున్నారు. అప్పటికి ఈరోజు ఆపరేషన్, రేపు ఆపరేషన్ అంటూ ఏడాది బట్టి చెప్పుకొస్తున్నారు. ఆపరేషన్ జరగకపోతే బ్రతకడు, ఆయన బదులు అధ్యక్షుడిగా వేరే వ్యక్తిని చూడాలంటూ అంటున్నారు.


ఇప్పుడు కూడా ఇదే తరహా ప్రచారాన్ని మళ్ళీ తెరపైకి తీసుకువస్తున్నారు. ఆ వీడియోని మాత్రమే కాకుండా నిన్న పార్లమెంట్ లో ప్రసంగించినప్పుడు కూడా ఇక ఎక్కువ కాలం బ్రతకడనే ప్రచారం చేశారు. ఈ తప్పుడు ప్రచారం గ్లోబల్ జర్మనీ నియంత హిట్లర్ కు సంబంధించిన సమాచార మంత్రి చేసిన ధోరణి ఇప్పుడు అమెరికా, యూరప్ దేశాలు అనుసరిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: