
అక్రమార్జనను అక్రమ మార్గంలో తరలించే విధానాన్ని అడ్డుకోవడానికి ఈడీ ప్రయత్నాలు చేస్తుంటుంది. ఈడీ పెట్టిన మనీ లాండరింగ్ 100 కేసుల్లో 96 శాతం శిక్షలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈడీ చేసే సోదాల్లో కచ్చితత్వమైన విధానం వల్ల దాదాపు అన్ని కేసుల్లో శిక్షలు పడుతున్నాయి. కోర్టులు గనక విచారణను వేగవంతం చేస్తే శిక్షలు ఇంకా తొందరగా పడతాయి. కానీ కోర్టుల్లో కేసులు ఎక్కువగా పెండింగ్ లో ఉన్నాయి.
కాబట్టి వేగంగా విచారణ చేయడం కుదరదు. కానీ ఈడీ మాత్రం తన అధికారాలను ఉపయోగించుకుని ప్రతి కేసులో కచ్చితమైన ఆధారాలను సేకరిస్తుంది. ప్రతి దాంట్లో ఎక్కడ కూడా ఏ చిన్న తప్పు దొర్లకుండా చూసుకుంటుంది. ఉదాహరణకు ఢిల్లీ లిక్కర్ కేసులో ఏకంగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్టు చేసింది. అంటే ఈడీ విచారణ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రినే జైల్లో పెట్టిందంటే ఈడీ ఎంతటి బలమైన ఆధారాలను సమర్పించిందో అర్థం చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో కవిత కూడా జైలుకెళ్లే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి.