ఇదే.. ఇదే.. ర‌గులుతున్న అగ్ని ప‌ర్వ‌తం... అంటూ అప్పుడెప్పుడో సూప‌ర్ స్టార్ కృష్ణ‌.. పాడితే.. ప్రేక్ష‌కులు ప‌ర‌వ‌శించి పోయారు!  సినిమా హాళ్ల‌కు పోటెత్తి కృష్ణా.. నువ్వు సూప‌రూ.. నీయాక్టింగ్ సూప‌రూ.. అంటూ చ‌ప్ప ట్లు కొట్టి.. అభిమానులు చంక‌లు గుద్దుకున్నారు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఇదే పాట రాష్ట్ర టీడీపీ అధినేత చంద్ర‌బాబు గుండెల్లోనూ వినిపిస్తోంద‌ట‌!. ఆయ‌న హృద‌యం భ‌గ్న‌మైంద‌ని, భ‌గ్గు మంటోంద‌ని, భ‌డ‌భాగ్ని ఏ క్ష‌ణానైనా పేలేందుకు రెడీగా ఉంద‌ని అంటున్నారు ఆయ‌న‌కు అత్యంత చేరువ‌గా ఉండే త‌మ్ముళ్లు.. సొంత త‌మ్ముడ‌నుకునేరు ఆయ‌న‌న్ను ఎప్పుడో విదిలించుకుని వ‌దిలించుకున్నారుగా!



అదేంటి.. నిత్యం ప్ర‌శాంత చిత్తంతో చిరు మంద‌హాసంతో.. తాను పుట్టింది, పెరిగింది.. పెర‌గ‌బోయేది, తి న్నదీ తింటున్న‌దీ.. ప్ర‌జ‌ల కోసం, ప్ర‌జ‌ల చేత‌, ప్ర‌జ‌ల వ‌ల‌న అని చెప్పే చంద్ర‌బాబుకు భ‌గ్న హృద‌య మా? అని కొంద‌రు త‌మ్ముళ్లు నోళ్లు వెళ్ల‌బెట్టారు.  ఇక‌, ఈ వార్త అనుకూల మీడియా ప్ర‌చారం కంటే రాష్ట్ర వ్యాప్తంగా త‌మ్ముళ్ల చెవుల్లో మార్మోగిపోయింది. వెంట‌నే రాష్ట్ర పార్టీ కార్యాల‌యాల‌కు ఏమైంది?  మా బాబు కు ఏమైంది? అంటూ ఫోన్లు, వాట్సాప్ మేసేజ్‌లు పోటెత్తాయి. తీరా విష‌యం తెలుసుకున్నాక‌.. త‌మ్ముళ్లు కూడా భ‌గ్న హృద‌యం బ‌రువెక్కింద‌ని రివ‌ర్స్ మెసేజ్‌లు పెట్టార‌ట‌!



అనుకున్న‌దొక్క‌టి.. అయింది ఒక్క‌టి.. అన్న‌ట్టుగా మారిందట చంద్ర‌బాబు ప‌రిస్థితి. గ‌త ఏడాది ప్ర‌జ‌లు ఓడించారు. ఈ బాధే పోలేదు.. ఇప్పుడు తాను న‌మ్మిన‌.. త‌న‌ను న‌మ్మిన త‌మ్ముళ్లు ఓడిస్తున్నారు. అదీ ఎన్నిక‌ల వేళ‌.. క‌ల‌లోనైనా పార్టీ వీడ‌ర‌నుకున్న వారే .. పార్టీని వీడి వెళ్లి.. మాట‌ల తూటాల‌తో త‌న‌ను చెండాడుతుంటే.. బాబు హృద‌యం భ‌గ్గుమంటోంద‌ట‌! జ‌గ‌న్ పాల‌న‌పై తానెత్తిన పిడికిలిలో బ‌లం త‌గ్గి.. జ‌నమంతా జ‌గ‌న్ జ‌గ‌నంటూ.. జ‌న‌మెత్తిన గ‌ళం విని చంద్ర‌న్న‌కు హృద‌యం భ‌గ్న‌మైంద‌ట‌!  స్థానిక ఎన్నిక‌లు వాయిదా త‌న పార్టీకి సెలైన్ నింపుతుంద‌నుకున్నా.. సుప్రీం దెబ్బ‌తో స‌ర్కారు కు గేట్లెత్త‌డం బాబు మైండ్‌ను బ్లాక్ చేసింద‌ట‌! ఇదే ఇదే.. ఇప్పుడు బాబుగారి గుండెల్లో గాయం చేసింద‌ట‌! మ‌రి ఈ బాధ తీరేదెన్న‌డు..  తీర్చేదెన్న‌డు?.. అంతా జ‌గ‌న్మాయ‌!

మరింత సమాచారం తెలుసుకోండి: